Begin typing your search above and press return to search.

ఎస్ బ్యాంక్ కు బూస్ట్..18 నుంచి నిషేధం ఎత్తివేత

By:  Tupaki Desk   |   14 March 2020 7:00 AM GMT
ఎస్ బ్యాంక్ కు బూస్ట్..18 నుంచి నిషేధం ఎత్తివేత
X
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎస్ బ్యాంకును ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. మార్చి 5వ తేదీన విధించిన మారిటోరియాన్ని ఆర్బీఐ ఈనెల 18వ తేదీన మారటోరియాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక కేంద్రం రూపొందించింది. దీనికి కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలపడంతో ఇక ఎస్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సంక్షోభంలో కూరుకున్న ఎస్ బ్యాంక్ ను ఆదుకునేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ బ్యాంక్ లో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర సూచనల మేరకు దిగ్గజ సంస్థలు వచ్చాయి. దీంతో ఎస్ బ్యాంక్ త్వరలోనే గాడిన పడనుంది. ఎస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక -2020కు కేంద్రం ఆమోదం తెలపడంతో ఈనెల 13వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో మూడు 3 రోజుల్లోగా బ్యాంకు పై మారటోరియం ఎత్తివేయనున్నట్లు - 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నారు.

అయితే 100 శాతం షేర్లు ఉన్న కంపెనీలకు మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుందని - మిగతా ఇన్వెస్టర్లకు 75% వాటాలకు ఇది వర్తిస్తుందని కేంద్రం నిర్ణయించింది. ఎస్‌ బీఐ వాటాలకు సంబంధించి 26%కి మాత్రమే మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుందని - మిగతా ఇన్వెస్టర్లకు 75% వాటాలకు ఇది వర్తిస్తుంది. పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా ఎస్ బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ.6,200 కోట్లకు పెంచారు. ఆర్‌ బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ.5,000 కోట్లు ఉంది.

కొత్త బోర్డు ఇలా..

ఎస్‌ బ్యాంకు కొత్త బోర్డును త్వరలోనే ఎంపిక చేయనున్నారు. వీటిలో ఎస్‌ బీఐ డైరెక్టర్లు ఇద్దరు ఉంటారు. కొత్త బోర్డు ఏర్పాటైన 7 రోజుల్లోగా అడ్మినిస్ట్రేటర్‌ తప్పుకుంటారు. ఎస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ కొత్తగా ఏర్పడబోయే బోర్డుకు ఎండీ - సీఈఓగా వ్యవహరించనున్నారు.

బంధన్ బ్యాంక్ కూడా పెట్టుబడులు

ఎస్ బ్యాంక్ ను కాపేందుకు మరో ప్రేవేటు బ్యాంక్ బంధన్ బ్యాంక్ ముందుకు వచ్చింది. రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రూ.10 చొప్పున రూ.30 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో ఎస్ బ్యాంక్ కోలుకోనుంది. త్వరలోనే ప్రజలకు ఈ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.