Begin typing your search above and press return to search.

హాట్‌ సమ్మర్‌లో కూల్‌ బీర్లు భారీగా తాగేస్తున్నారు

By:  Tupaki Desk   |   24 May 2015 10:35 AM GMT
హాట్‌ సమ్మర్‌లో కూల్‌ బీర్లు భారీగా తాగేస్తున్నారు
X
ఓవైపు మంట పుట్టించే ఎండ తీవ్రతకు జనాలు ఆగమాగమైపోవటం తెలిసిందే. ఎండ తీవ్రతతో మందుబాబులు సైతం విపరీతంగా రెచ్చిపోతున్నారు. మద్యం సంగతి తర్వాత.. కూల్‌ కూల్‌ బీర్లు భారీగా తాగిపారేయటం బాగా ఎక్కువైందన్నది తాజా గణాంకాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది.

పెరిగిన ఎండలతో బీర్ల వినియోగం భారీగా పెరిగిందని చెబుతున్నారు. ఏప్రిల్‌ నెల మొత్తంలో 21 లక్షల కేసులు (ఒక్కో కేసుకు 12 బాటిళ్లు ఉంటాయి) అమ్ముడు కాగా.. మే నెల 22 నాటికి ఏకంగా 27 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.

నెల ముగిసేందుకు ఇంకా ఎనిమిది రోజులు ఉందనగా.. దాదాపుగా ఆరు లక్షల కేసులు అదనంగా అమ్ముడు కావటం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా బీర్ల వినియోగం భారీగా ఉందని చెబుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో పోలిస్తే.. హైదరాబాద్‌ మహానగరంలో బీర్ల వినియోగం భారీగా ఉందని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో రోజుకు 8,200 కేసులు అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు. అంటే.. కాస్త అటూఇటూగా నగరవాసులు లక్ష బీరు బాటిళ్లు రోజుకు ఉఫ్‌మని ఊదేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎండల తీవ్రతతో మిగిలిన వ్యాపారాలు (కూల్‌డ్రింక్స్‌.. కొబ్బరికాయల వ్యాపారాలు మినహా) కాస్త డౌన్‌ అయితే.. బీరు.మాత్రం భారీగా అమ్ముడుపోవటం కాస్తంత విశేషమే.