Begin typing your search above and press return to search.
హెచ్1బీ: ట్రంప్ పేల్చిన తాజా బాంబ్ ఇది
By: Tupaki Desk | 1 Dec 2018 11:22 AM GMTఅధికారంలోకి వచ్చింది మొదలు వీసాలను టార్గెట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక కలవర పాటు ఆదేశాలను వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ నిర్ణయాలను వెలువరించిన ట్రంప్ సర్కారు తాజాగా మరో కలకలం చోటుచేసుకునే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెచ్1 బీ వీసా జారి విధానానికి సంబంధించిన నిబంధనల్లో తాజా మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రతిపాదనలతో శుక్రవారం ఒక నోటీసు జారీ చేసింది. విదేశీ కార్మికుల్లో అత్యున్నత నైపుణ్యం, అత్యధిక జీతం పొందేవారికి హెచ్1 బీ వీసాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కొత్త ప్రతిపాదనలతో ట్రంప్ ప్రభుత్వం నోటీసును జారీ చేసింది.
రాత్రి అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసాలకు సంబంధించిన నిబంధనలను మార్పుతూ ప్రతిపాదనలు చేసిన ప్రకారం కాంగ్రెస్ నిర్ణయించే పరిమితి మేరకు విదేశీ కార్మికులకు హెచ్ 1 బీ వీసా ఇచ్చే సమయంలో ఈ నిబంధనలను పాటించాలి. యూఎస్ సిటీజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) నిర్ణయించే తేదీల్లో విదేశీయులు ఎలక్ర్టానిక్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని అమెరికా పేర్కొంది. ప్రస్తుతం ఏడాదికి 65వేల వీసాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ అనుమతి ఉంది.అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న 20వేల దరఖాస్తులను ఈ పరిమితి నుంచి మినహాయిస్తారు. కొత్త ప్రతిపాదనలపై డిసెంబర్ 3 నుంచి జనవరి 2వ తేదీ మధ్య ప్రజలు తమ అభిప్రాయం తెలుపవచ్చని అమెరికా ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఈ పరిణామాల పరంపర ప్రారంభం అయిన సమయంలోనే ముంబైలోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఎడ్గార్డ్ కాగన్ వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. హెచ్ 1బి వీసా విషయంలో అమెరికా నిబంధనలు కఠినతరం చేస్తున్న క్రమంలో భారతీయుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయని అయితే, భారత్‌తో సత్సంబంధాలకే ట్రంప్ కట్టుబడి ఉన్నారని, అర్హులైన భారతీయులను తమ దేశం సదా ఆహ్వానిస్తూనే ఉంటుందని చెప్పారు. అమెరికాలో చదివే భారతీయులు, భారత్ లో చదివే అమెరికన్లను చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. తమ దేశంలోని ఇండియన్లు ఎన్నో అవకాశాలు పొందుతున్నారన్నారు. ట్రంప్ పగ్గాలు చేపట్టి నుంచి గమనిస్తే అవకాశాల విస్తృతి కోసం ఆయన ఎంతగా కృషి చేస్తున్నారో తెలుస్తుందన్నారు. ఎడ్గార్డ్ ప్రకటన అమెరికా వెళ్లే భారతీయులకు కాస్త ఊరటనిచ్చేలా ఉంది.