Begin typing your search above and press return to search.
రాణి రుద్రమ మరణశాసనం దొరికింది
By: Tupaki Desk | 20 April 2016 7:01 AM GMTకాలగర్భంలో కలిసి పోయిన ఎన్నో విషయాలకు ఆధారం చరిత్రే. అయితే.. ఈ చరిత్రను పరిశోధించే కొద్ది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటిదే మరొక అంశం బయటకు వచ్చింది. కాకతీయ సామ్రాజ్య విస్తరణతోపాటు.. వైభవాన్ని దశదిశలా చాటిన కాకతీయ మహారాణి రుద్రమదేవికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది.
ఇప్పటివరకూ ఆమె మరణానికి సంబంధించి ఉన్న అభిప్రాయాలు తప్పన్న విషయాన్ని చెప్పే సాక్ష్యం బయటకు వచ్చింది. ఇప్పటివరకూ రాణి రుద్రమదేవి క్రీస్తు శకం 1296లో మరణించినట్లుగా చెప్పేవారు. అయితే.. ఆమె అంతకు ముందే మరణించినట్లుగా తాజాగా రుజువైంది. రుద్రమదేవికి సంబంధించిన మరణశాసనం ఒకటి తాజాగా గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా నల్లమలలో బయటపడిన తాజా శాసనం ప్రకారం రుద్రమదేవి క్రీస్తుశకం 1289 నవంబరు చివరి వారంలో ఆమె మరణించినట్లుగా తాజాగా బయటపడిన శాసనం స్పష్టం చేస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మెడిమల్కల సమీపంలోని పురాత ఆలయంలో కాకతీయులకు సంబంధించిన శాసనాలు.. చిత్రాలు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం రుద్రమదేవి మరణానికి సంబంధించి కొత్త విషయం బయటకు వచ్చినట్లైంది.