Begin typing your search above and press return to search.
జైలు ఇడ్లీలు ఇప్పుడెందుకు అంత హాట్ టాపిక్
By: Tupaki Desk | 18 Oct 2019 3:51 AM GMTఅన్ని ధరలకు రెక్కలు వచ్చినట్లే ఇడ్లీ ధరలు ఎప్పుడో పెరిగిపోయాయి. నాలుగు చిన్న ఇడ్లీలు.. లేదంటే రెండు పెద్ద ఇడ్లీలు రూ.10 స్థానే ఇప్పుడు రూ.40 వరకూ చేరుకున్నపరిస్థితి హైదరాబాద్ మహానగరంలో నెలకొంది. భాగ్యనగర్ తో పోటీ పడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇడ్లీ రేటును పాతిక నుంచి రూ.30 వరకూ వసూలు చేస్తున్నాయి హోటళ్లు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా మినిమంగా ఈ ధరను ఫిక్స్ చేశాయి.
ఇదిలా ఉంటే.. మహబూబ్ నగర్ జైలు వారు మాత్రం అక్కడి ప్రజలకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నారు. జైల్లోని ఖైదీలు తయారు చేస్తున్న ఇడ్లీలను కారుచౌకగా అమ్ముతున్నారు. జైలు సిబ్బందితో నిర్వహించే పెట్రోల్ బంకు లాభాల బాట పట్టిన నేపథ్యంలో తక్కువ ధరకు టిఫిన్లు అమ్మటం ద్వారా కొత్త ఒరవడికి తెర తీస్తున్నారు.
నాలుగు ఇడ్లీలు కేవలం రూ.5లకే అమ్ముతున్నారు. దీంతో.. జైలు ఇడ్లీల కోసం రద్దీ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రుచి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండటం.. నాణ్యతలోనూ ఏ మాత్రం తేడా లేకపోవటంతో జైలు ఇడ్లీలు స్వల్ప వ్యవధిలోనే డిమాండ్ సాధించటమే కాదు.. వీటి కోసం పొద్దున్నే రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఇడ్లీ బిజినెస్ మొదలైన మొదటి రోజు 400 మంది కస్టమర్లు వస్తే.. మూడో రోజుకు 1100 మందికి చేరుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జైలు ఎదుట నిర్వహిస్తున్న ఈ హోటల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది