Begin typing your search above and press return to search.
చిన్పపిల్లల్నికూడా నయీం వదలలేదే!
By: Tupaki Desk | 9 Sep 2017 8:48 AM GMTకరడుగట్టిన నేరగాడు - దయాదాక్షిణ్యం లేని మానవ మృగం నయీం చచ్చి చాలా కాలం అవుతున్నాకూడా అతని అకత్యాలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్నోహత్యలు - బెదిరింపులు - సెటిల్మెంట్లు చేసి రూ.కోట్లు కొల్లగొట్టిన నయీం మరెన్నోపాశవిక చర్యలకు పాల్పడినట్టు ఆధారాలు లభిస్తున్నాయి. తన పైశాచిక లైంగిక ఆనందం కోసం ఎంతో మంది అభం శుభం తెలియని బాలికలను - యువతులను దారుణంగా అనుభవించడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది 12 - 14 - 15 ఏళ్లలోపు వారేనని తెలుస్తోంది. చివరకు బంధువుల పిల్లలను కూడా కాటేశాడు ఈ కామాంధుడు.
మంచిగా చదువు చెప్పిస్తానని, పోషిస్తానని చెప్పి తీసుకువచ్చి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. ఈ దారుణ అకత్యాలన్నింటికీ తన అక్క - అత్త - భార్య సహకారమందించేవారని నయీం కేసును విచారిస్తున్న పోలీసులకు తన గ్యాంగ్ సభ్యులు చెప్పడంతో వారు విస్తుపోయారు. అంతేకాకుండా తన మాట విననివారిని తీవ్రంగా హింసించి, వారిని గొంతు పిసికి చంపేవాడు. కొంతమందిని గోవా - ఛత్తీస్ గఢ్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి తన ముఠా సభ్యులకు అప్పజెప్పేవాడు. ఇక దందాలు చేసేటప్పుడు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు - పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నెలల పసికందులను తెలివిగా ఉపయోగించుకునేవాడు.
నయీం అనుచరులను - కుటుంబ సభ్యులను విచారిస్తుంటే ఇలాంటి విస్తుపోయే దారుణాలెన్నోబయటపడుతున్నాయి. వాడికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు నయీం కంటే అతడి సోదరి సలీమా దారుణానికి తెగించింది. స్వయానా తాళి కట్టిన భర్తను అంతమొందించింది. అతను చేసిన పాపమల్లా.. వేరే వ్యక్తితో నడుపుతున్న అక్రమ సంబంధాన్ని మానుకోమని ఆమెకు చెప్పడమే. దీనికే రెచ్చిపోయిన సలీమా తన భర్త గొంతును చున్నీతో బిగించి అతి దారుణంగా హతమార్చింది.