Begin typing your search above and press return to search.
యూపీలో 'సన్' స్ట్రోక్ తారాస్థాయికి చేరింది
By: Tupaki Desk | 29 Jan 2017 10:35 AM GMTఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. యూపీ ఈ సారి దాదాపు 20 మంది పైగా ముఖ్య నేతల వారసులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై వీలు దొరికినప్పుడల్లా విరుచుకుపడే బీజేపీ నాయకులు ఈ ఎన్నికల్లో కనీసం 15 మంది వారసలను పోటీలో నిలిపారు. అధికార-ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా కాంగ్రెస్ - సమాజ్ వాదీ - బీజేపీ పార్టీలు చాలా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి వుండటంతో వారసుల సంఖ్య ఇంకా పెరిగే వీలుంది.కుటుంబ పార్టీగా ముద్ర పడిన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో సహా కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారు. పార్టీలో శక్తివంతమైన మైనార్టీ నేత అబ్దుల్లా అజాం కుమారుడు అజాం ఖాన్, ములాయం సింగ్ రెండో కుమారుడు ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ (లక్నో కంటోన్మెంట్ నుంచి) పోటీ చేస్తున్నారు.
బీజేపీ ఇప్పటి వరకు 370 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకో 33 స్థానాలకు ప్రకటించాల్సివుంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ - పార్టీ సీనియర్ నేత - రాజస్థాన్ గవర్నరు కళ్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్ - కైరానా ఎంపీ హుకుమ్ సింగ్ కుమార్తె మృగంక ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాఫియా సామ్రాజ్యాన్ని వీడి బిజెపిలో చేరిన గోండా ఎంపీ బృజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు ప్రతీక్ భూషణ్ గోండా అసెంబ్లీ స్థానం టిక్కెట్ కైవసం చేసుకున్నారు. సీనియర్ నేత లాల్జీ టాండన్ కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అశుతోష్ తాండన్ లక్నో (తూర్పు) స్థానంలో పోటీ చేస్తున్నారు. అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్ధార్థనాథ్ సింగ్, మోరాదాబాద్ ఎంపీ కున్వార్ సర్వేష్ కుమార్ సింగ్ తనయుడు కున్వార్ సుశాంత్ సింగ్, వారణాసి కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోత్స్న శ్రీవాత్సవ తనయుడు సౌరభ్, బంస్వాగ్ ఎంపీ కమలేష్ పాశ్వన్ సోదరుడు విమలేష్, సలేంపూర్ ఎంపీ రవీంద్ర కుశ్వాహా సోదరుడు జైనాథ్ (భత్పర్ రాణి నుంచి) పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఓం ప్రకాష్ సింగ్ కుమారుడు అనురాగ్ సింగ్ (మీర్జాపుర్ లోని ఛునార్ నుంచి), సీనియర్ నేత స్వామి ప్రసాద మౌర్య కుమారుడు ఉత్కర్ష్ (ఉంఛహార్ నుంచి) పోటీ చేస్తున్నారు.
యూపీలో సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 105 స్థానాలకు గాను ఇప్పటి వరకు 43 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మాజీ జఫీర్ అలీ నక్వీ కుమారుడు సయీఫ్ అలీ, మాజీ మంత్రి, సిట్టింగ్ పల్వాల్ ఎమ్మెల్యే కరన్ దలాల్ కుమారుడు ఉదరు దలాల్ కూడా ఇప్పటి వరకు టిక్కెట్ల పొందారు. మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రాజ్‌పాల్ కుమారుడు అజిత్ త్యాగి ముర్దా నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన రాజ్‌పాల్ బిఎస్సీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ముజఫర్ నగర్ మాజీ ఎంపీ కదీర్ రానా భార్య సయ్యద్ బేగం - బిఎస్సీ మాజీ మంత్రి రామవీర్ ఉపాధ్యాయ సోదరుడు ముకుల్, బీఎస్పీ రాజ్యసభ సభ్యులు వీర్ సింగ్ తనయుడు వివేక్ సింగ్, నవాబ్ కోబాబ్ హమీద్ కుమారుడు అహ్మద్ హమీద్ టిక్కెట్లు సాధించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/