Begin typing your search above and press return to search.
ఒమిక్రాన్ దెబ్బ.. ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు..!
By: Tupaki Desk | 28 Dec 2021 12:30 PM GMTదేశంలో మళ్లీ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ కరోనా వైరస్ మన దేశంలో కూడా శర వేగంగా వ్యాప్తి చెందుతున్న వాతావరణం ఉంది. ఇప్పటికే కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైతం ఈ కొత్త వేరియంట్ సోకుతుండటంతో దేశ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో మళ్లీ కరోనా భయం కమ్ముకుంటుంది. ఈక్రమంలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ణు కట్టడి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో సగటున రోజుకు ఏడు వేల కేసులు నమోదు అవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ రేటు కూడా పెరుగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది.
నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాలు కూడా కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించింది. పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే ఇప్పుడు కరోనా పాజిటివ్ రేటు 0.5 శాతం దాటితే మరిన్ని కఠిన నిబంధనలు విధించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తాయి.
ఇక ప్రార్థనా మందిరాల్లోకి సైతం భక్తులు వెళ్లకూడదని నిషేధం విధించారు. కేసుల తీవ్రత దృష్ట్యా ప్రార్థన మందిరాల్లో పలు కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మాల్స్ విషయంలో కూడా ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సరి - బేసి పద్ధతిలోనే మాల్స్‌కు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 15 రోజుల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రతిరోజూ సగటున రెండు నుంచి మూడు శాతం మాత్రమే నమోదు అయ్యేవి.
అయితే ఇప్పుడు అవి 25 నుంచి 30 శాతానికి పెరిగిపోయాయని ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. ఒమిక్రాన్ వల్లే కేసులు భారీగా పెరిగిపోతున్నాయి అని కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. ఈ కేసుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని కూడా ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది.