Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్లకు షాకిచ్చే వార్త ఇదీ..

By:  Tupaki Desk   |   30 July 2019 5:29 AM GMT
సాఫ్ట్ వేర్లకు షాకిచ్చే వార్త ఇదీ..
X
కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయడాలు.. కీబోర్డ్ మౌస్ తో టిక్ టిక్ మంటూ పని.. అదే పనిగా కుర్చీలో కూర్చోవడం.. పని ఒత్తిడి.. జంక్ ఫుడ్.. వేళా పళా లేని తిండి, నిద్రా.. ఇవన్నీ కలగలపి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు అరుదైన వ్యాధులు తీసుకువస్తున్నాయని తాజా సర్వేలో తేలింది.

కండరక్షీణత చాలా డేంజర్ వ్యాధి. ఈ అరుదైన వ్యాధికి చికిత్స ఇప్పటివరకు ప్రపంచంలో లేదు.. మనం చేతులు- కాళ్లు- ముఖం లేదా దేన్ని ఆడించాలన్నా కండరాల సాయంతోనే అలా చేయగలం.. అలాంటి కండరాలు పనిచేయకపోతే విగత జీవిగా మంచంపై పడుకోవాల్సిందే. అలాంటి అరుదైన కండరక్షీణత ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో కనిపిస్తోందని తాజాగా డనోన్ ఇండియా అనే సంస్థ పరిశోధించి మరీ చెప్పిన వాస్తవమిదీ.. కండరాల క్షీణత వల్ల ఒక్కో అవయవం పనిచేయకుండా పోయి మనం కనీసం కూర్చోవడానికి నిలబడానికి కూడా లేని పరిస్థితి అంతిమంగా వస్తుందని తేలింది.

డనోన్ ఇండియా తాజాగా మొదటి దశలో హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న 1800మందికి వైద్యపరీక్షలు నిర్వహించింది. ఇందులో 535 మంది మహిళలు, 519మంది పురుషులకు పూర్తి స్థాయి పరీక్షలు చేసింది. వీరిలో కండరాలు చాలా బలహీనంగా మారినట్టు తేలింది. ఇందుకు కారణం అధికంగా చేతులతో పని.. కండరాలపై ఒత్తిడి, ముఖ్యంగా ప్రోటీన్ లేని జంక్ ఫుడ్ తినడం వల్లే ఈ కండరాలు క్షీణిస్తున్నట్టు గుర్తించింది.

శరీర ఎదుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. కండరాలు బలంగా ఉండడానికి ప్రోటీన్లు కలగలిసిన ఆహారం తీసుకోవాలి.. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ కండరాలతో చేసే కంప్యూటర్ పనులు ఎక్కువగా చేస్తున్నారు. ఇదే వారి కొంప ముంచుతోంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పాలు, గింజలు, కాయధాన్యాలు, బీన్స్, విత్తనాలు, పుట్టగొడుగులు, సోయాబీన్స్ తీసుకోవడం లేదు. ఇవి కంప్లీట్ శాఖాహారం. వీటిని ఎవ్వరూ తిన్న దాఖలాలు లేవు. బేకరి, విదేశీ రుచులకు అలవాటు పడ్డ సాఫ్ట్ వేరర్లు ఇప్పుడు ఈ ప్రోటీన్ లోపంతో తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నట్టు డనోన్ ఇండియా సర్వే సంస్థ తేల్చింది.