Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు మరింత పరీక్ష.. రంగంలోకి సోనియా అందుకేనా?
By: Tupaki Desk | 31 March 2022 9:32 AM GMTఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోందని.. ఇక, కోలుకోవడం కష్టమని.. పెద్ద ఎత్తున విశ్లేషణలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అయితే.ఈ క్రమంలో పార్టీని మళ్లీ లైన్‌లో పెట్టేందుకు.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె .. ఏకంగా.. రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను మార్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదేసమయంలో అసమ్మతి నేతల బృందం జీ-23ని కూడా లైన్‌లో పెట్టేందుకు సోనియా రెడీ అయ్యారు. ఇప్పటికే వారితో చర్చలు కూడా జరుపుతున్నారు. వాస్తవానికి సోనియా.. ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ.. ఆమె ముందుకు సాగుతున్నారు.
దీనికి ప్రధాన కారణం.. ముందున్నమరింత ముప్పును ఇప్పుడు పసిగట్టడమే! కాంగ్రెస్ ఐదురాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కొని ఓడిపోయినప్పటికీ.. అసలు సిసలు పరీక్ష.. త్వరలోనే ఎదురుకానుంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీతో కాంగ్రెస్ ముఖాముఖి తలపడనుంది. నిజానికి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం అంతంతే అయినా.. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఇక, పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కూడా అత్యంత కీలకం.. ఆయా రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవాల్సిన అగత్యం ఉంది.
అదేసమయంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురల్లోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఇవి అత్యంత కీలకం.. కాంగ్రెస్‌కు ప్రాణ ప్రదం కూడా. ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లపై పార్టీ ఎక్కువగా దృష్టి సారిస్తోంది.
సంస్థాగత బలహీనతలే ఓటమికి కారణమని పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది. ఈ క్రమంలో సోనియా స్వయంగా కలుగ చేసుకుని.. ఆయా రాష్ట్రాల నేతల పనితీరును బేరీజు వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు అయిదు కోట్ల మంది కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు.
సత్వర నిర్ణయాలతో పాటు ఎన్నికలు త్వరలోనే జరగనున్న రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు.. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎప్పటికప్పుడు సోనియా చక్కబెట్టే పనిలో పడ్డారు. నేతలకు నేరుగా మార్గనిర్దేశం చేస్తూ క్రియాశీలంగా వ్యవహరిస్తుండడంతో అన్ని స్థాయిల నేతల్లో కదలిక ప్రారంభమైంది. త్వరలోనే దేశవ్యాప్తంగా పీసీసీ చీఫ్‌లను మార్చనున్నారు.
అదేసమయంలో అసమ్మతి, అసంతృప్త నేతలను సాధ్యమైనంత వరకు బుజ్జగించే ప్రయత్నాలుచేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై.. ఉద్యమాలకు కూడా రెడీ అయ్యారు. ఈ పరిణామాలను బట్టి.. కాంగ్రెస్ ఏవిధంగాముందుకు సాగుతుందనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా... ఈ ఏడాది..వచ్చే ఏడాది.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్షేనని అంటున్నారు పరిశీలకులు.