Begin typing your search above and press return to search.
టీటీడీ చానల్ ఉద్యోగుల పాడు బుద్ధి.. ఆఫీసులో అలాంటి పనులా?
By: Tupaki Desk | 11 Nov 2020 1:50 PM GMTఅదో అధ్యాత్మిక చానల్. అలాంటి చానల్ లో పని చేసే ఉద్యోగులు భక్తి పారవశ్యంతో పరవశించిపోయేలా ఉండమని కోరుకోవటం అత్యాశే అవుతుంది. సాధువుల.. సన్యాసుల మాదిరి ఉండనక్కర్లేదు కానీ.. చానల్ పరువు పోయే చెత్త పనులు.. వికారపు చేష్టలు అయితే చేయకూడదు కదా? కానీ.. అందుకు భిన్నంగా టీటీడీ వారి చానల్ లో పని చేసే ఉద్యోగులు చేస్తున్న పనులు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.
ఆ మధ్యన టీటీటీ చానల్ కు ఛైర్మన్ గా పని చేసిన సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ పై లైంగిక వేధింపు ఆరోపణులు రావటం.. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కారు ఆయన్ను సాగనంపటం తెలిసిందే. ఆయన స్థానంలో వచ్చిన కొత్త ఛైర్మన్ మీద ఆరోపణలు లేకున్నా.. అక్కడి ఉద్యోగుల తీరుపై బయటకొచ్చిన సమాచారం సంచలనంగా మారుతోంది. తాజాగా విధి నిర్వహణ సమయంలో పోర్న్ వీడియోలు చూస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో.. అలెర్టు అయిన టీటీడీ విజిలెన్సు విభాగం తనిఖీలు నిర్వహించింది. షాకింగ్ అంశం ఏమంటే.. ఈ సందర్భంగా 25 మందికి పైగా ఉద్యోగులు పట్టుబడటం హాట్ టాపిక్ గా మారింది. ఇష్యూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వద్దకు వెళ్లటంతో ఆయన సీరియస్ కావటమే కాదు చర్యలకు ఓకే చెప్పారు. ఇంతకీ ఈ చెత్త వ్యవహారం ఎలా బయటకు వచ్చిందన్న విషయంపై లోతుగా ఆరా తీస్తే.. ఉద్యోగుల నిర్లక్ష్యం మరీ ఎంతన్న విషయం కళ్లకు కట్టినట్లుగా తెలియజేసే ఉదంతం ఇటీవల చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఎస్వీబీసీకి చెందిన శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి చానల్ కు ఒక భక్తుడు మొయిల్ చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన లింకునుపంపాల్సిన చానల్ ఉద్యోగి.. ఒక పోర్న్ చానల్ లింకును రిప్లై మొయిల్ లో పెట్టారు. దీంతో.. ఈ అంశాన్ని సదరు భక్తుడు టీటీడీ ఛైర్మన్ కు కంప్లైంట్ చేశారు. దీంతో.. ఈ విషయాన్ని విజిలెన్సు శాఖకు అప్పజెప్పారు.
వారి చేసిన విచారణలో.. అసలు పోర్న్ లింకు ఎందుకు వచ్చిందన్న విషయంపై ఫోకస్ చేశారు. ఈ సందర్భంగా చానల్ కు చెందిన పాతిక మంది ఉద్యోగులు ఆఫీసు సమయంలో.. ఆఫీసులోనే పోర్న్ చానళ్లు చూస్తున్న వైనాన్ని గుర్తించారు. చేయాల్సిన పని చేయకుండా.. ఈ చెత్త పని చేస్తున్న వైనం టీటీడీ అధికారులకు షాకింగ్ గా మారింది. ఆరాచకానికి పరాకాష్ఠ అంటే ఇదేనేమో?