Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : విదేశాలకి ఆ డ్రగ్ పంపడానికి సిద్ధం ..భారత్ !

By:  Tupaki Desk   |   7 April 2020 8:10 AM GMT
కరోనా ఎఫెక్ట్ : విదేశాలకి ఆ డ్రగ్ పంపడానికి  సిద్ధం ..భారత్ !
X
కరోనా వైరస్ ప్రభావంతో తీవ్ర జన నష్టాన్ని ఎదుర్కొంటున్న అత్యవసర దేశాలకు అవసరమైన మందులను వెంటనే పంపుతామని భారత్ ప్రకటించింది. ముఖ్యంగా కరోనా చికిత్సలో వాడే మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను తమకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని కోరిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ మెడిసిన్ ని పంపడానికి నిరాకరించిన పక్షంలో.. తాము ప్రతీకార చర్యకు దిగ వచ్చునని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

ఈ మెడిసిన్ కరోనా చికిత్సకు బాగా పని చేస్తుందని నిపుణులు స్పష్టం చేయడం తో దీని ఎగుమతిని భారత్ రెండు వారాల క్రితం నిలిపి వేసింది. కాగా-అమెరికా, ఇండియా దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే తమ అభ్యర్థనను మోదీ నిరాకరించిన పక్షంలో తాను ఆశ్చర్యపోతానని ట్రంప్ అన్నారు. ఇతర దేశాలకు దీని ఎగుమతిని ఇండియా నిలిపివేసిందన్న విషయం తమకు తెలుసునన్నారు.

గత కొన్నేళ్లుగా వాణిజ్యానికి సంబంధించి ఇండియాకు తమ దేశం ఎంతో తోడ్పడిందన్నారు. ఈ మెడిసిన్ ని ఆయన గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. అయితే ఇది కరోనా చికిత్సకు ఖఛ్చితంగా పని చేస్తుందా అన్న విషయం ఇంకా నిర్ధారణ కావలసి ఉందన్నారు. ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ ..అమెరికా లో మరణమృదంగం సృష్టిస్తుంది. అమెరికా లో ఇప్పటి వరకు 367,650 మంది కి కరోనా సోకగా ...10,943 మంది కరోనా కారణంగా మృతిచెందారు.