Begin typing your search above and press return to search.

మోడీ మొనగాడితనాన్ని చెప్పిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ

By:  Tupaki Desk   |   8 Nov 2021 5:03 AM GMT
మోడీ మొనగాడితనాన్ని చెప్పిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ
X
భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంటుందన్న విషయం తెలిసిందే అయినా.. ఆ ఇమేజ్ ను మరింతగా పెంచిన క్రెడిట్ మాత్రం నరేంద్ర మోడీకే దక్కుతుంది. గడిచిన ఏడున్నరేళ్లుగా తిరుగులేని ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన బలం ఏమిటో? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాధినేతల్లో ఆయన ఎంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని తాజాగా మార్నింగ్ కన్సల్ట్ సంస్థ మరోసారి స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన రేటింగ్ మిగిలిన దేశాధినేతలు.. ప్రధానమంత్రుల కంటే మిన్నగా ఉండటమే కాదు.. నెంబరు వన్ స్థానంలో నిలవటం విశేషంగా చెప్పక తప్పదు.

ప్రపంచానికి పెద్దన్నఅమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జో బిడెన్ టాప్ 10లో దిగువన ఉంటే.. నరేంద్ర మోడీ మాత్రం అగ్రస్థానంలో నిలవటం గమనార్హం. గతంలోనూ మోడీ నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. తాజాగా మరోసారి ఆయన నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. గ్లోబల్ లీడర్ అఫ్రూవల్ రేటింగ్ లో నరేంద్ర మోడీకి 70 శాతం రేటింగ్ రావటం గమనార్హం. ప్రధానమంత్రి మోడీ తర్వాత గ్లోబల్ లీడర్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ.. రెండో స్థానంలో నిలిచారు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెటర్. ఆయనకు 66 శాతం రేటింగ్ వచ్చినట్లుగా మార్నింగ్ కన్సల్ట్ సంస్థ పేర్కొంది.

మూడో స్థానంలో ఇటలీ ప్రధాని మారియో 58 శాతంతో.. నాలుగో స్థానంలో జర్మనీ ఉక్కు మహిళగా పేర్కొనే ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ 54 శాతంతో నిలిచారు. ఐదో స్థానంలో ఇప్పటికే పలు విషయాల్లో వినిపించే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ నిలిచారు. 47 శాతం ఓట్లు గ్లోబల్ లీడర్ గా పేర్కొన్నాయి. ఆరోస్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44 శాతంతో నిలిస్తే.. ఏడో స్థానంలో కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో 43 శాతంతో.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 40 శాతం రేటింగ్ తో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా మోడీ ఇమేజ్ ఎంతన్న విషయాన్ని తాజాగా సర్వే ఫలితం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.