Begin typing your search above and press return to search.
అమ్మ.. మార్నింగ్ స్టార్ మరీ ఇంత కక్కుర్తా?
By: Tupaki Desk | 12 Aug 2017 12:42 PM GMTపేరులో స్టార్ ఉందనేమో కానీ.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్సులు. సాధారణంగా బెంగళూరులో రాత్రి వేళలో బయలుదేరే బస్సులు.. పొద్దునకు హైదరాబాద్ రావటం మామూలే. అయితే.. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బెంగళూరులో బయలుదేరిన బస్సులు.. శనివారం ఉదయం పది గంటల సమయానికి ఎక్కడి వరకూ చేరుకున్నాయో తెలిస్తే షాక్ తినాల్సిందే.
దాదాపు పన్నెండు గంటల ప్రయాణ సమయం దాటిన తర్వాత కర్నాటక సరిహద్దుల్ని దాటకపోవటం చూసిన.. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు షాక్ తిన్నారు. ఎందుకిలా జరిగింది? రాత్రి అంతా ప్రయాణం ఎక్కడ జరిగిందని నిలదీసిన డ్రైవర్లను.. వారు చెప్పిన మాట విన్న ప్రయాణికులకు నోటి వెంట మాట రాని పరిస్థితి.
ఇంతకూ జరిగిందేమంటే.. అంతరాష్ట్ర సరిహద్దుల్లో కట్టాల్సిన ట్యాక్స్ ను ఎగవేసేందుకు రెండు బస్సు డ్రైవర్లు వేరే మార్గంలోకి తీసుకెళ్లటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
రాత్రంతా నిద్రలో ఉన్న ప్రయాణికులు.. పొద్దున లేచేసరికి తాము ప్రయాణించాల్సిన మార్గంలో బస్సు వెళ్లటం లేదన్న విషయాన్ని గ్రహించారు. బస్సు డ్రైవర్ ను నిలదీయగా.. వారి నోటి నుంచి అతి కష్టమ్మీద కక్కుర్తి విషయం వచ్చినట్లుగా ప్రయాణికులు మండిపడుతున్నారు. ట్రావెల్స్ వారు చెప్పిన దాని ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ కు బస్సులు చేరుకోవాల్సి ఉండగా.. ఆ సమయానికి రెండు బస్సులు కర్ణాటక సరిహద్దుల్ని దాటకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బూదగుంపలో ప్రయాణికులు కాసేపు నిరసన వ్యక్తం చేయటం.. మీడియాకు సమాచారం అందించటంతో మార్నింగ్ స్టార్ డ్రైవర్ల కక్కుర్తి బయటకు వచ్చింది. పది గంటల వేళలో కర్ణాటక సరిహద్దుల నుంచి బయలుదేరిన రెండు బస్సులు ఈ (శనివారం) సాయంత్రానికి లేదంటే రాత్రికి చేరుకోవచ్చని చెబుతున్నారు.