Begin typing your search above and press return to search.

రష్యా పై ఆంక్షలను బిగిస్తున్న ఐరోపా దేశాలు

By:  Tupaki Desk   |   9 April 2022 6:30 AM GMT
రష్యా పై ఆంక్షలను బిగిస్తున్న ఐరోపా దేశాలు
X
ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాపై ఐరోపా దేశాలు ఆంక్షలను మరింతగా కఠినతరం చేస్తున్నాయి. ఐరోపాలోని చాలా దేశాలు రష్యా నుండి చమురు, గ్యాస్ ను దిగుమతి చేసుకుంటున్నాయి. వీటితో పాటు బొగ్గును కూడా దిగుమతి చేసుకుంటున్నాయి. యుద్ధం నేపధ్యంలో బిగిస్తున్న ఆంక్షల్లో భాగంగా బొగ్గు దిగుమతులపై నిషేధం విధించాలని డిసైడ్ చేశాయి. బ్రసెల్స్ లో యురోపియన్ సభ్య దేశాలు అత్యవసరంగా భేటీ అయ్యాయి.

ఈ భేటీలో అనేక అంశాలను చర్చించినప్పటికీ ప్రధానంగా అర్జంటుగా రష్యా నుండి బొగ్గు దిగుమతులను నిషేధించాలనేది కీలకమైన నిర్ణయం. ఐరోపా దేశాలకు బొగ్గును ఎగుమతి చేయటం ద్వారా రష్యా ఏడాదికి 410 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తోంది. అలాంటిది అర్జంటుగా బొగ్గు దిగుమతలను నిలిపేస్తే ఆ మేరకు ఆదాయాన్ని రష్యా కోల్పోవాల్సిందే అని ఐరోపా దేశాలు అంచనా వేశాయి.

అయితే బొగ్గు దిగుమతుల నేపధ్యంలో చేసుకున్న ఒప్పందాలను ఒకసారి పరిశీలించాలని కూడా డిసైడ్ అయ్యాయి. ఇదే సమయంలో చమురు, గ్యాస్ సరఫరా విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఐరోపా దేశాలకు రష్యా నుండి బొగ్గే కాకుండా చమురు, గ్యాస్ కూడా సరఫరా అవుతోంది. బొగ్గు దిగుమతులను నిలిపేస్తే మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనా వీలైనంత తొందరలో దాన్ని అధిగమించవచ్చని అంచనా వేశాయి.

ఇదే సమయంలో చమురు, గ్యాస్ కు ప్రత్యామ్నాయం లేని కారణంగా రష్యా నుండి చమురు, గ్యాస్ సరఫరా అవసరంలేదంటే మాత్రం ఐరోపా దేశాలు పూర్తిగా దెబ్బతినేస్తాయని సమావేశం అభప్రాయపడింది. ఎందుకంటే ఐరోపా దేశాల రోజువారి చమురు, గ్యాస్ అవసరాల్లో సుమారు రష్యానే 60 శాతం సరఫరాచేస్తోంది.

జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల అవసరాలకు 70 శాతం చమురు, గ్యాస్ రష్యా నుండే అందుతోంది. కాబట్టి చమురు, గ్యాస్ అవసరాలు, ప్రత్యామ్నాయాలు లేని కారణంగా కేవలం బొగ్గు దిగుమతలను మాత్రం నిషేధించాలని సమావేశం డిసైడ్ చేసింది.