Begin typing your search above and press return to search.

విస్కీలోనా ఉన్న మ‌జా...

By:  Tupaki Desk   |   6 Oct 2015 10:30 PM GMT
విస్కీలోనా ఉన్న మ‌జా...
X
మంచి ప‌ద్యాన్ని ఫ్రెంచి మ‌ద్యంతో పోల్చాడు శ్రీ‌శ్రీ‌... మ‌ద్యం అలవాటు లేనివారికి ఇది రుచించ‌క‌పోయినా మ‌ద్యంప్రియుల‌కు మాత్రం ఈ మాట మహా ప‌సందుగా అనిపించ‌క మాన‌దు. ప్ర‌పంచంలో మ‌ద్యానికి ఉన్న ప్రాధాన్యం మ‌నం ఎంత కాద‌నుకున్నా కాద‌న‌లేనిది... మ‌ద్యం ప్రేమికులు దాని గురించి ఎంత‌యినా మాట్లాడుతారు... మ‌ద్యంలో ర‌కాలు...ధ‌ర‌లు... అదిచ్చే కిక్కు... దాని పుట్టు పూర్వోత్త‌రాలు... వంటివి వారికి ఎప్పుడూ హాట్ టాపిక్కే.

మ‌ద్యంలో ఎన్నోర‌కాలున్నా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌గా వాడుక‌లో ఉన్న‌వి బీరు - విస్కీలే. విస్కీ అంట వాటర్ ఆఫ్ లైఫ్ అని అర్ధమట. యుస్కీ అనే స్కాటిష్ ప‌దం నుంచి విస్కీ అనే ప‌దం పుట్టిందని అని చెబుతుంటారు మ‌ద్యం పారిభాషిక ప‌దాల శోధ‌కులు - ప‌రిశోధ‌కులు. త‌క్కువ కిక్కిచ్చే బీర్ తోనే ఎక్కువ‌మందికి మద్యం అల‌వాటు మొద‌ల‌వుతుంద‌నేది ఇంకో అధ్య‌య‌నంలో తేలిన నిజం. వోర్ట్ అనే ముడి బీరు నుంచి విస్కీ తయారవుతుందట. ఒక గ్లాసు బీరులో వాటర్ -ఈస్ట్ - మాల్ట్స్ ఉంటాయట. అస‌లు సిస‌లు ముడి బీరులో ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా వడపోస్తారట. విస్కీ తయారైనప్ప‌టి నుంచి క‌నీసం మూడు సంవత్సరాలు పాత‌రేసి ఉంచితే వ‌చ్చే రుచే వేర‌ని చెబుతారు ఈ రంగంలో ఎక్స్ ప‌ర్టులు.

తాజాగా ఓ ప‌రిశోధ‌న‌లో తేలిన విష‌యం వింటే తాగే విస్కీ క‌థ మ‌న‌మే తెలుసుకోవ‌చ్చు. 150 సంవత్సరాల క్రితం తయారైన గ్లెనావాన్ స్పెషల్ లిక్కర్ విస్కీ ప్రపంచం మొత్తంమ్మీదా ఓల్డెస్ట్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ద్ రికార్డుల్లోకి ఎక్కింది.1851 లేదా 1858 మధ్య కాలంలో ఐరిష్ కుటుంబం దీనిని తయారు చేసిన దీనిరేటు 14,840 పౌండ్లు పలికుతోందట. ఇక ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన విస్కీ ముచ్చ‌ట్లు తెలుసుకోవాల్సిందే. మ్యాక్ మిల‌న్ విస్కీని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చెబుతుంటారు. హాంగ్ కాంగ్ లో దొరికే దీని ధ‌ర 393,109 పౌండ్లట. మ‌న రేటు ప్ర‌కారం చూస్తే కోట్ల రూపాయల్లో ఉంటుంది ఇది. ఇంత రేటున్నా దీని వాడ‌కం త‌క్కువేమీ కాదు. మొత్తం విస్కీ వినియోగంలో దీనివాటా రెండు శాతం. సెకెండ్ కు 135 పౌండ్ల ఆదాయం రాబడుతున్న విస్కీ నిమిషానికి 2500 బాటిళ్లు సేల్ అవుతున్నాయ‌ట‌. అదీ క‌థ‌... ఇంకేముంది... తాగినోళ్ల‌కు తాగినంత‌.