Begin typing your search above and press return to search.

రోడ్డు యాక్సిడెంట్స్ ఆ టైంలోనే ఎక్కువ‌ట‌

By:  Tupaki Desk   |   25 Sep 2017 4:53 AM GMT
రోడ్డు యాక్సిడెంట్స్ ఆ టైంలోనే ఎక్కువ‌ట‌
X
యాక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఎప్పుడు జ‌రుగుతుంటాయి? అన్న ప్ర‌శ్న వేస్తే.. పొద్దు పొద్దున్నే అన్న మాట వ‌స్తుంది. కానీ.. తాజాగా చేప‌ట్టిన ఒక అధ్య‌య‌నం యాక్సిడెంట్ల మీద పూర్తిస్థాయి వివ‌రాల్ని వెల్ల‌డించింది. దేశంలో జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాల్ని కేంద్రం విశ్లేషించింది. గ‌త ఏడాది దేశ వ్యాప్తంగా 4.80 ల‌క్ష‌ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగితే అందులో 85,834 ప్ర‌మాదాలు (18%) కేవ‌లం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి 6 గంట‌ల మ‌ధ్య‌లోనే ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

2016లో గంట‌కు 55 రోడ్డు ప్ర‌మాదాలు న‌మోదు అయ్యేవ‌ని.. అందులో ప్ర‌తి గంట‌కు17 మంది మ‌ర‌ణించే వార‌ని నివేదిక పేర్కొంది. రోడ్డు ప్ర‌మాదాల్లో 4,94,624 మంది క్ష‌త‌గాత్రులు అయ్యార‌ని పేర్కొంది. ఈ ప్ర‌మాదాల్లో 25 శాతం వ‌ర‌కూ 25 నుంచి 35 ఏళ్ల లోపు వారేన‌న్న విష‌యాన్ని గుర్తించారు.

సాయంత్రం త‌ర్వాత ఎక్కువ‌గా ప్ర‌మాదాలు జ‌రిగేది సాయంత్రం ఆరు గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల మ‌ధ్య‌నే అన్న కొత్త విష‌యాన్ని స‌ద‌రు నివేదిక బ‌య‌ట‌పెట్టింది. రోడ్డు ప్ర‌మాదాల‌కు ప్ర‌ధాన కార‌ణంగా డ్రైవ‌ర్ల నిర్ల‌క్ష్యం.. త‌ప్పిదాలేన‌ని తేల్చారు. మొత్తం ప్ర‌మాదాల్లో 84 శాతం యాక్సిడెంట్ల‌కు కార‌ణం డ్రైవ‌ర్ చేసే త‌ప్పులే. మితిమీరిన వేగం కూడా ఇన్ని ప్ర‌మాదాల‌కు కార‌ణంగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2016లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల్లో ఎక్కువ బైకుల కార‌ణంనే చోటు చేసుకోవ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెప్ప‌క‌త‌ప్ప‌దు. మొత్తం రోడ్డు ప్ర‌మాదాల్ని విశ్లేషిస్తే.. గంట‌కు 19 చొప్పున టూవీల‌ర్ కార‌ణంగా యాక్సిడెంట్లు జ‌రుగుతున్న‌ట్లు గుర్తించారు. సో.. టూవీల‌ర్ ను న‌డిపేవారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రాన్ని తాజా అధ్య‌య‌నం స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.