Begin typing your search above and press return to search.
ఎక్కడి నేతలు అక్కడే...!
By: Tupaki Desk | 26 Sep 2018 6:54 AM GMTముందస్తు ఎన్నికలు జోరందుకున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులను ప్రకటించేసింది కూడా. ఇక ఇతర పార్టీలు మహాకూటమి కట్టే పనిలో పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి 105 మంది అభ్యర్ధులు అందరూ సిట్టింగులే కావడం గమనార్హం. ఇక మిగిలిన పార్టీలు కూడా మహాకూటమి జత కట్టిన తర్వాత ఆయా పార్టీలకు పొత్తులో ఏ సీట్లు వస్తాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అన్నది తేలనుంది. ఇది తేలేందుకు మరో వారం పదిరోజులు పట్టవచ్చంటున్నారు. ఇక ప్రధాన పార్టీలకు చెందిన అధ్యక్షులు - ప్రధాన కార్యదర్శులు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు వీరంతా ఎక్కడి నుంచి విజయం సాధించి శాసనసభకు వెళ్లారో అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాను ఎప్పుడూ పోటీ చేసే గజ్వేల్ నుంచే పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన 105 మంది సిట్టింగ్ అభ్యర్ధులలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ జిల్లా హుజూరునగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. మహాకూటమి ఏర్పాటైనా - కాకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ధానం మాత్రం మారే అవకాశాలే లేవంటున్నారు.
ఇక భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతోనూ పొత్తులో లేదు. దీంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ అవకాశాలున్నాయి. ఇక్కడ లక్ష్మణ్ కు మంచి పట్టు ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాత్రం ఎక్కడ నుంచి పోటీ చేసేది... అసలు చేస్తారా లేదా అన్నది తేలలేదు. అయితే, జూబ్లీహిల్స్ లేదా కోరుట్ల చేస్తారని వార్తలొస్తున్నాయి. వామపక్షాలకు చెందిన పార్టీలలో సిపిఎంకు తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ సారి పోటీ చేసే ఉద్దేశ్యం లేదంటున్నారు. మరో పార్టీ సిపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా హుస్నాబాద్ నుంచి మహాకూటమి అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో అన్ని పార్టీల అగ్ర నాయకులు తాము తప్పక గెలిచే స్ధానాల నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు.