Begin typing your search above and press return to search.
చిత్తూరులోనే ఏకగ్రీవాలెక్కువా ?
By: Tupaki Desk | 4 Feb 2021 3:30 PM GMTఒకవైపు చంద్రబాబునాయుడు మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాలు వద్దంటు గట్టిగా చెబుతున్నారు. చంద్రబాబు అయితే టెలిఫోన్ కాన్ఫరెన్సులు పెట్టుకుని మరీ నేతలను పోటీ చేయించమని ఆదేశిస్తున్నారు. అయితే ఇంత చెబుతున్నా రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఇప్పటివరకు వార్తలు అందిన ప్రకారం చిత్తూరు జిల్లాలోనే ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి.
కడపటి వార్తలు అందే సమయానికి జిల్లాలోని 454 పంచాయితీలకు గాను 96 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిల్లో అత్యధిక పంచాయితల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారు. అలాగే కడప జిల్లాలో 206 పంచాయితీలకు గాను ఏకగ్రీవమైంది 21 పంచాయితీలే. ఇందులో కూడా వైసీపీ మద్దతుదారులే ఎక్కువగా గెలిచాయనటంలో సందేహం అవసరం లేదు.
ఒకవైపు చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు సొంతజిల్లా అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి జిల్లాలో అన్నీ పంచాయితీలకు ఎన్నికలు జరగాల్సిందే అని ఒకటికి పదిసార్లు ఆదేశిస్తున్నా 96 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఏకగ్రీవాలు వద్దని ఎన్నికలే ముద్దని చంద్రబాబు, నిమ్మగడ్డ ఎంత చెప్పినా స్ధానికులకు తెలుసు ఎన్నికలంటే వచ్చే సమస్యఏమిటో. అందుకనే అవకాశం ఉన్నంతలో ఏకగ్రీవాలు జరిగిపోతున్నాయి.