Begin typing your search above and press return to search.
వారిలో ఒమిక్రాన్ ను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువే..!!
By: Tupaki Desk | 29 Dec 2021 2:30 PM GMTగడచిన రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నడూ లేనంత విపత్తును సృష్టించింది. లక్షల కొద్ది మరణాలు వైరస్ కారణంగా వెలుగు చూశాయి. ఇప్పటికే వివిధ దేశాల్లో లక్షల సంఖ్యలో కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఒక్క రోజుల్లోనే 12 లక్షలకు పైగా కేసులు నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండే తాజాగా సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ మరలా ప్రపంచ దేశాల మదిలో గుబులు పుట్టిస్తుంది. అందుకే చాలా దేశాలు వ్యాక్సినేషన్ ను పూర్తిస్థాయిలో ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో టీకా పంపిణీ మరింత ఉధృతం చేశారు అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవానికి ఇది చాలా మందికి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కరోనా సోకిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకే అవకాశం తక్కువ ఉందని ఈ అధ్యయనంలో తేలింది. భారతదేశంలో పుట్టిన డెల్టా వేరియంట్ ఇంతకు మునుపు సోకి దాని నుంచి కోలుకుని ఉంటే ఒమిక్రాన్ ముప్పు తక్కువ ఉంటుందని పరిశోధకులు చెప్పారు. గతంలో వైరస్ సోకినప్పుడు దానికి వ్యతిరేకంగా పని చేసే ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు మద్దత్తు గా నిలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
వైరస్ సోకిన తర్వాత రెండు వారాల మంచి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్ఫెక్షన్ మన బాడీ లోని వ్యాధి నిరోధక శక్తిని సుమారు 14 రెట్లు పెంచుతుందని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ కారణంగా మానవ శరీరం రీ ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పారు ఈ వ్యాధి నిరోధక శక్తి ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ బారిన పడిన సుమారు 33 మందిపై ఈ పరిశోధన జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిపై పరీక్షించారు. దీనితోపాటు మానవుడు ఈ కొత్త వేరియంట్ ఏ మేరకు ఎదుర్కోగలడు అనే దానిపై కూడా పరిశోధన సాగించినట్లు చెప్పారు. అయితే కొత్త వేరియంట్ ప్రభావం మనిషి పై ఏ మేరకు ఉంటుంది అనే దానిపై నిపుణులు ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోయారు. కొన్ని దేశాలలో కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని.. మరికొన్ని దేశాల్లో తక్కువగా ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు కరోనా కొత్త వేరియంట్ కేసులు సుమారు 130 కి పైగా దేశాలలో నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే డెల్టా తో పోల్చితే ఈ కొత్త వేరియంట్ తో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. లక్షణాలు కూడా డెల్టా తో పోలిస్తే కొంతమేర తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.