Begin typing your search above and press return to search.
మినీ కాంగ్రెస్ భవన్+మినీ ఎన్టీఆర్ ట్రస్ట్=గులాబి భవన్
By: Tupaki Desk | 11 Dec 2015 9:04 AM GMTఅదో మినీ కాంగ్రెస్ భవన్.. అంతేకాదు దీనికి మరో పేరు కూడా ఉంది.. మినీ ఎన్టీఆర్ ట్రస్ట్.. కానీ ఆ కార్యాలయానికి మరో పేరు, దాని అసలు పేరు టీఆర్ ఎస్ భవన్. వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ భవనానికి మారుపేర్లు ఇవే. 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం తర్వాత, ఎన్నికల ముందు కూడా.. ఇతర పార్టీల నుంచి వలసలు విపరీతంగా జరిగిపోయాయి. అప్పటివరకూ పేరు మోసిన గ్రామస్థాయి నాయకులనుంచి.. రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ అందరిదీ ఒకటే రూటు.. అదే టీఆర్ ఎస్ భవన్ రూటు. అయితే వీరి చేరికతో టీఆర్ ఎస్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది.
ఒకప్పుడు ఎంతోమంది నాయకులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. కేసీఆర్ వెంట నడిచారు. కానీ కొత్తగా వస్తున్న, వచ్చిన నాయకులతో.. అప్పటివరకూ కేసీఆర్ వెనుకున్నవారంతా మరింత వెనక్కు వెళిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు టీఆర్ ఎస్ అంటే చెప్పుకోవడానికి కేసీఆర్ తర్వాత హరీష్ రావు - ఈటెల రాజేంద్ర - జగదీష్ రెడ్డి - నాయిని ఇలా ఎప్పుడు చూసినా కొంత మంది మాత్రమే కనిపించేవారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ - టీడీపీ నేతల జంపింగ్స్ తో నిండిపోవడంతో.. పాతవాసనలేవి ఇప్పుడు టీఆరెస్ భవన్ లో కనిపించడం లేదని ఆపార్టీ నేతలే అంటున్నారు. పీసీసీ చీఫ్ లుగా పనిచేసిన కేకే - డీఎస్ నుండి కొండా దంపతుల వరకు ఎంతో మంది కాంగ్రెస్ నేతలు అందులో చేరారు.
కేసీఆర్ కేబినెట్ లో దాదాపు 75శాతం మంది టీడీపీ నుండి వచ్చిన నేతలే కావడం విశేషం. కడియం శ్రీహరి - తుమ్ముల - పోచారం - పట్నం మహేందర్ రెడ్డి - తలసాని నుండి నిన్న చేరిన సాయన్న వరకు అంతా పచ్చ పార్టీ నాయకులే. అయితే మొదటి నుండి కేసీఆర్ తో ఉన్నవాళ్లలో చాలా మంది బయటకు వెళ్లిపోయారు. లేకపోతే ఎక్కడో వెనుక సీట్లలో సర్దుకుంటున్నారు. ఉద్యమ సమయంలో అయితే ఎవ్వరినీ బతిమిలాడి చేర్చుకోలేదు. వెళ్లే వాళ్లను ఉండమని కూడా చెప్పలేదు కేసీఆర్. కానీ ఇప్పుడు ఎవ్వరు వచ్చినా కండువా కప్పి కారెక్కిస్తున్నారు. అందుకే పార్టీ ఆఫీస్ సెపరేట్ అయినా కళ మాత్రం కాంగ్రెస్ - టీడీపీ నేతలదే అనే వాదనలు వినిపిస్తున్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వలసలు మరింత పెరగవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా తెరాసలో ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ నిన్నటి వరకు మీడియాలో హల్ చల్ చేసిన వారంతా ఇప్పుడు క్రమక్రమంగా తెరవెనక్కు వెళ్లిపోతుంటే కొత్తగా పార్టీలో చేరేవారి హడావిడే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది.