Begin typing your search above and press return to search.
మొగుళ్ళకి రోజులు దగ్గర పడ్డాయ్..జర భద్రం..!
By: Tupaki Desk | 20 Nov 2019 8:40 AM GMTఎప్పుడైతే అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్డుపై తిరుగుతుందో అప్పుడే ఇండియా కి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ అప్పట్లో చెప్పారు కానీ - ఈ రోజుల్లో అయన బ్రతికి ఉంటే మాత్రం ..ఒక మగాడు అర్ధరాత్రి ఒంటరిగా ఎప్పుడు తిరుగుతాడో అప్పుడే ఇండియాకి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెప్పేవారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఆలా తయారైంది. సమాజంలో మగ వారి కంటే ..ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకుంటూ ... మగవాళ్ళని ( మొగుళ్ళని ) చంపడానికి కూడా వెనుకాడటం లేదు.
అసలు , తమ భర్తలని దైవం తో సమానంగా చూసే ఈ సమాజంలో ప్రస్తుతం కొందరు భార్యలు - భర్తలని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. అదేంటి ..భార్యలని కదా భర్తలు చంపేశారు అని ఎక్కువగా చూస్తుంటాం అని అనుకుంటున్నారా..ప్రెజెంట్ ట్రెండ్ మారింది. ఒక సర్వే ప్రకారం ఇప్పుడు భర్తలని చంపే - భార్యలే ఎక్కువగా ఉన్నారంట. దీనికి ప్రధాన కారణం భర్తలు పెట్టే టార్చర్ భరించలేక ..భర్తలకు ఎదురుతిరిగి వారి భరతం పెట్టేస్తున్నారు.
వరకట్నం కోసం అత్తింటి వేధింపులను - హత్యాయత్నాలను కోడళ్లు బేలగా భరించట్లేదు. ఆ వేధింపులను భరించలేక.. అత్తింటివారి హత్యాయత్నాల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి.. భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది. కాకతీయ వర్సిటీ సోషియాలజీ విభాగ రిసెర్చ్ స్కాలర్ రమేశ్.. హైదరాబాద్ లోని చంచల్‌గూడ మహిళా జైల్ లోని ఖైదీలపై ఇటీవల అధ్యయనం చేశారు. అక్కడి మహిళా ఖైదీల్లో 61 శాతం వరకట్న సంబంధిత హత్య చేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఆయన అధ్యయనంలో వెల్లడైంది. వివరంగా చూస్తే .. జైల్లో మొత్తం 217 మంది ఖైదీ లుండగా - అందులో 133 మంది వరకట్న వేధింపులు భరించలేక భర్తలను హత్య చేసిన వారే ఉన్నారంటే ఆడవాళ్లు ఏ రేంజ్ లో అభివృద్ధి చెందారో అర్థం చేసుకోవాలి. జైల్లో ఉన్న వారిలో 25-35 ఏళ్ల మధ్య వయస్కులు 87మంది - 36-45 ఏళ్ల మధ్య వయస్కులు 33 మంది ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. వీరిలో 131 మంది అసలు బెయిల్ కు కూడా దరఖాస్తు చేసుకోలేదని వెల్లడయింది.