Begin typing your search above and press return to search.

అత్యంత ప్రభావవంతమైన 100 మందిలో మోడీయే ఫస్ట్

By:  Tupaki Desk   |   29 March 2017 5:30 PM GMT
అత్యంత ప్రభావవంతమైన 100 మందిలో మోడీయే ఫస్ట్
X
ప్రముఖ ఆంగ్ల దినపత్రి ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఏటా విడుదల చేసే ‘‘అత్యంత ప్రభావవంతమైన 100 మంది భారతీయులు’’ జాబితాలో ఈసారి కూడా మొదటి మూడు స్థానాలు పాతవారికే దక్కాయి. మొదటి స్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో అమిత్ షా.. మూడో స్థానంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. కాగా ఈసారి జాబితాలో అత్యధికులు బీజేపీ నేతలే కావడం విశేషం.

దేశంలోని మొత్తం 18 మంది ముఖ్యమంత్రులకు ఈ జాబితాలో స్థానం దక్కగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కంటే చాలామంది ముందు నిలిచారు. చంద్రబాబునాయుడు 48వ స్థానంలో కేసీఆర్ 72వ స్థానంలో నిలిచారు. కాగా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమంత్రుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. మొత్తం జాబితాలో ఆయన 8వ స్థానంలో నిలవడం విశేషం. పైగా ఈ జాబితాలో చోటు సంపాదించడం ఆయనకు ఇదే తొలిసారి. మొదటిసారే డైరెక్టుగా టాప్ టెన్లోకి వచ్చేశారు.

కాగా ఈ జాబితాలో కాంగ్రెస్ అధినేత్ర సోనియా 9.. కుమారుడు రాహుల్ 10వ స్థానంలో ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, ప్రభుత్వాల్లో ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, ఆటగాళ్లు, నటులు ఈ జాబితాలో ఉన్నారు.

వీరే టాప్ టెన్...
--------
పేరు స్థానం గత ఏడాది స్థానం
---------
మోడీ 1 1
అమిత్ షా 2 2
మోహన్ భగవత్ 3 3
జేఎస్ ఖేహర్(సీజేఐ) 4 41
అజిత్ ధోవల్ 6 4
ముఖేశ్ అంబానీ 7 5
యోగి ఆదిత్యనాథ్ 8 0
సోనియా 9 5
రాహుల్ 10 9
----------

ఇండియన్ ఎక్స్ ప్రెస్ టాప్ 100లో సీఎంలు వీరే..
---
పేరు రాష్ర్టం స్థానం
------
యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ 8
నితీశ్ కుమార్ బీహార్ 13
మమతా బెనర్జీ బెంగాల్ 14
శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ 17
ఫడ్నవీస్ మహారాష్ర్ట 18
అమరీందర్ సింగ్ పంజాబ్ 20
వసుంధరరాజె రాజస్థాన్ 23
కేజ్రీవాల్ ఢిల్లీ 33
రమణ్ సింగ్ ఛత్తీస్ గఢ్ 34
మెహబూబా ముఫ్తీ జమ్ముకశ్మీర్ 36
సిద్ధరామయ్య కర్ణాటక 38
పినరయి విజయన్ కేరళ 45
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ 48
మనోహర్ లాల్ ఖత్తర్ హర్యాణా 63
నవీన్ పట్నాయిక్ ఒడిశా 65
కేసీఆర్ తెలంగాణ 72
శర్వానంద సోనోవాల్ అస్సాం 91
విజయ్ రూపానీ గుజరాత్ 94
----------
కాగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారి ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళ 97వ స్థానంలో.. పటేళ్ల రిజర్వేషన్ల పోరాటకారుడు హార్దిక్ పటేల్ 100వ స్థానంలో ఉన్నారు. అధికారంలో లేకపోయినా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. చాలామంది ప్రస్తుత సీఎంలు ఈ జాబితాలో చోటే సంపాదించుకోలేకపోగా బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం 42వ స్థానంలో ఉండడం విశేషం.