Begin typing your search above and press return to search.
తెలంగాణ ఉనికి చాటే 5 ప్రముఖ కంపెనీలు ఇవే
By: Tupaki Desk | 11 Dec 2021 12:30 AM GMTపేరుకు కొత్త రాష్ట్రమే కావొచ్చు. కానీ.. డెవలప్ మెంట్ విషయంలో దేశంలో దూసుకెళుతున్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. అంతేకాదు.. ఫార్మా రంగంలో దేశానికి హబ్ తెలంగాణ నిలిచింది. అత్యధిక లాభాల్ని ఆర్జించటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేసే సత్తా ఈ కంపెనీల సొంతం. తాజాగా బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా ఐదో ఎడిషన్ టాప్ 500 ఇండియన్ కంపెనీల జాబితాలో తెలంగాణకు సంబంధించి 29 సంస్థలు చోటు దక్కించుకున్నాయి.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలంగాణకు సంబంధించిన 29 కంపెనీల విలువ ఏకంగా రూ.6.9 లక్షల కోట్లు ఉండగా.. అందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కంపెనీల విలువే రూ.3.45 కోట్లుగా ఉండటం విశేషం. ఈ 29 కంపెనీల కారణంగా దాదాపు 2 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నట్లుగా తేల్చారు. రాష్ట్ర జీడీపీలో 18 శాతం వాటాను సొంతం చేసుకున్న ఈ కంపెనీలు తెలంగాణకు విలువైన ఆస్తులుగా మారాయనటంలో సందేహం లేదు.
మొత్తం 29 కంపెనీల్లో టాప్ 5 కంపెనీల్ని చూస్తే.. రూ.1.36 లక్షల కోట్ల విలువతో దివీస్ లాబోరేటరీస్ తెలంగాణలో అత్యంత విలువైన కంపెనీగా ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఈ కంపెనీ 33వ స్థానంలో ఉంది. రెండో స్థానంలో రూ.1.31 లక్షల కోట్లతో తెలంగాణలో రెండో విలువైన కంపెనీగా నిలిచాయి హిందూస్థాన్ జింక్ లిమిటెడ్. ఆలిండియా సథాయిలో 35వ స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో డాక్టర్ రెడ్డీస్.. నాలుగో స్థానంలో అరబిందో ఫార్మా.. ఐదో స్థానంలో లారస్ ల్యాబ్ లు నిలిచాయి. విశేషం ఏమంటే.. తెలంగాణకు అత్యంత విలువైన ఐదు కంపెనీలుగా నిలిచినవన్నీ కూడా ఫార్మా కంపెనీలే. ఇవే కాకుండా తెలంగాణకు సంబంధించిన బ్రైట్ కామ్ గ్రూపు 2791 శాతం వృద్ధిరేటుతో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న కంపెనీగా మొదటి స్థానంలో నిలిచింది.
నెట్ ప్రాఫిట్ విషయంలో టాప్ 20 కంపెనీల్లో తెలంగాణ కంపెనీలు రెండు చోటు దక్కించుకున్నాయి. హిందుస్థాన్ జింక్ రూ.7980 కోట్లతో 13వ స్థానం.. అరబిందో ఫార్మా రూ.5389 కోట్లతో 19వ స్థానం దక్కించుకోగా.. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ టాప్ 10 బూట్ స్ట్రాప్డ్ కంపెనీల జాబితాలో చోటు దర్కించుకుంది. దీని విలువ రూ.28,900 కోట్లుగా లెక్క చెబుతున్నారు.