Begin typing your search above and press return to search.
బాహుబలి దొంగని పట్టుకొన్నాడు
By: Tupaki Desk | 1 May 2017 7:45 PM GMTబాహుబలి ఏమి చేయలేడో చెప్పండి. ఇండియా లో బాహుబలి చేసింది చాలా ఉంది. సినిమా బిజినెస్ కాదు మేము చెపుతుంది. ఆ మధ్య హోటల్లో మెనూ తయారు చేశారు బాహుబలి సినిమా పైన. బాహుబలి డిజైనర్ చీరలు కూడా వచ్చాయి. అలా ఎవ్వరూ ఊహించలేని పనులు.. బహుబలి సినిమాకు సంభందం లేని బిజినెస్ కూడా చేశాడు బాహు. ఇప్పుడు ఏకంగా పోలీస్ గా మారిపోయాడు. రండి మన బాహుబలి దొంగని ఎలా పట్టుకున్నాడో చూద్దాం.
ఒరిస్సాలో బలిచంద్రపూర్ ఏరియా లో జజ్పుర్ జిల్లా లో ఏటిఎం దొంగతనాలు చాలాకాలంగా జరుగుతున్నాయి. సుమారుగా 2007 నుండి శాంభవ్ ఆచార్య అనే దుండగడు ఏటిఎం దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడిపై 50 కేసులు పైగా ఫైల్ చేశారట. అక్కడ దగ్గర ఉన్న కొన్ని పోలీసు స్టేషన్ లో కూడా చాలా కేస్లు ఉన్నాయి. పోలీసు స్పెషల్ స్క్వాడ్ ఈ దొంగని ఇక్కడ దగ్గరలో ఉన్న మల్టీప్లెక్స్ లో బాహుబలి 2 సినిమా చూస్తుండగా అరెస్టు చేశారట. ఇన్నాళ్ళూ తప్పించుకుని తిరిగినా.. బాహుబలి 2 చూద్దామని వచ్చేసరికి పోలీసులు పట్టేసుకున్నారు. అది కథ.
అలా మన బాహుబలి 2 ఆ దొంగ దొరికేలా చేశాడు. పోలీసుల పని కూడా తనే చేసేశాడనమాట. జై మాహిష్మతి అనుకోండి మరి!!