Begin typing your search above and press return to search.
హ్యాపీ మదర్స్ డే : అమ్మ మరియు ఆదివారం నో డౌట్స్ ప్లీజ్ !
By: Tupaki Desk | 8 May 2022 3:29 AM GMTవంట గదిలో అమ్మ ఎలా ఉన్నారు.. అబ్బా! చదువు ! అక్కడ కూడా అమ్మ చదువుతూ ఉన్నారు. పిల్లల కోసం తాపత్రయ పడుతూ రేపటిని దిద్దుతూ ఉన్నారు. బుజ్జాయిని గుండె మీద లాలిస్తూ ఉన్న అమ్మ ఎలా ఉన్నారు.. అక్కడ కూడా అమ్మ నడవడి దిద్దుతూ చదువుతూ ఉన్నారు. బిడ్డ బాల్యాన్ని చదవడం వికాసం.. దిద్దడం జ్ఞాపకం.. అటువంటి జ్ఞాపకంతో మీ జీవితం ఈ ఆదివారం పరిమళ సంబంధ ఛాయలనే అందివ్వాలన్నది నా కోరిక.. ప్రతిపాదన కూడా ! ఇప్పుడు తల్లులంతా క్షేమమే కదా !
తల్లులంతా ఏమవుతున్నారు.. యోగ్యత నిండిన ఆనందాలే ఇస్తున్నారా.. తల్లులకు ప్రత్యేకం కాదు తల్లుల వెంట తిరిగే బిడ్డలకు కొంగుచాటు బిడ్డలకు ఎప్పటికీ ఈ వారం ఈ ఆదివారం మౌనఛాయలు మరీ ప్రత్యేకం.. కొద్దిసేపు ఉన్నా కూడా ఆ రెప్పల వాకిట బిడ్డల రూపాన్ని చూసిన తల్లులకు పాదాభివందనాలు చేశాకే రోజు మొదలు కావాలి.. రెప్పల వాకిట రంగుల స్వప్న సాకారం మీ జీవితం.. ఆ మాతృమూర్తి మిగిల్చిన ఆయువు మరియు ఆనందం మీకు మాత్రమే కాదు ఈ లోకానికే సొంతం. అనండిక అమ్మకు జేజేలు అని! చిన్న మాట జేజేలు పలికి స్వీట్లు తినిపించి క్రీములు పులిమి చెప్పడంలో ఏమయినా ఆనందం ఉందా?వాటికి మించిన ఆనందం మన గెలుపును తన కళ్ల వాకిట నిలిపిన కాలానికి చెప్పే ఓ కృతజ్ఞత ఎంతో గొప్పది. ఆమె మనకు వెనుకటి గతం కావొచ్చు., రేపటి మౌనం కావొచ్చు మధ్య నడయాడే వర్తమానంలో చంచల నిశ్శబ్దం కాకుండా ఉంటే మేలు. అనండిక అమ్మకు నేను నాకు మా అమ్మ.. పరస్పర ప్రేమావగాహనలే ఈ ఆదివారం అందించి వెళ్తుంది అని!
ఆదివారాలు ప్రత్యేకం.. ఆదివారంతో పాటు అమ్మ కూడా ప్రత్యేకం. అమ్మ సామాన్యం తో పాటు ప్రత్యేకం. ఏ ప్రత్యేకం ఊసూ పట్టించుకోని సామాన్యం. అందుకే అమ్మకు అందుకై నాన్నకు ప్రత్యేకంగా చెప్పాల్సిన కృతజ్ఞతలు ఏమీ లేవు. ప్రేమ, అభిమానం నిండిన ఆదివారం బాగుంటుంది. ప్రేమ అభిమానం లేని ఆదివారం కూడా ఉంటుంది. అవి మాత్రం ఏ బిడ్డలకూ రాకూడదు. మండు టెండల్లో బిడ్డలే లోకంగా బతికిన తల్లులుంటే చాలు జీవితం ఓ గొప్ప స్ఫూర్తిని ఇచ్చి వెళ్తుంది. ఇంట్లో ఎన్ని వేదనలు ఉన్నా నవ్వుతూ ఎదురుగా నిలిచే అమ్మ ఉంటే చాలు ప్రతిరోజూ ప్రతి ఆదివారం ప్రత్యేకం అవుతుంది. తల్లుల కారణంగా మంచి లోకం నిర్మాణానికి నోచుకుంటుంది. తల్లుల కారణంగా మంచి ప్రపంచం ఒకటి కళ్లెదుల ఆవిష్కృతం అవుతుంది. మరి! ప్రత్యేకం అనుకునే ఆదివారాలు ఇంకెన్ని కావాలో ఇప్పుడే రాసుకోండి.
బిడ్డలకు సంస్కృతి ఇవ్వండి అది తల్లి బాధ్యత అని అంటారు కొందరు. అవును ! సంస్కృతి కారణంగా ఎన్నో మంచి సమయాలు కొత్త మార్పులకు కారణం అయి ఉంటాయి. అమ్మ నేర్పిన చదువు కారణంగా మాతృభాష వర్థిల్లుతుంది. అమ్మ నేర్పిన సంస్కృతి కారణంగా తోటి వారిని తోటి సంస్కృతిని తోటివారి భాషను, నడవడిని అర్థం చేసుకోవడం సాధ్యం అవుతుంది. అందరికీ అమ్మలే ఆదర్శం అయి ఉంటారు. నాన్నకు చెమట కష్టం అమ్మకు చెందిన చెమట కష్టం రెండూ వేర్వేరుగా ఉండవు. కనుక నాన్నలో అమ్మ, అమ్మలో నాన్న ఒక బాధ్యతగా మారేక జీవితం మనకు ఓ కొత్త ఆనందాన్ని ప్రసాదించి వెళ్తుంది. అందుకు ఈ ఆదివారం ఓ తోడు. తోడ్పాటు కూడా ! మీరు మీ అమ్మలను నేను మీ అమ్మలను ప్రేమిచండంలోనే మంచి మార్పు ఒకటి వ్యక్తీకరణకు నోచుకుంటుంది. బిడ్డల మార్పునకు, పరిణితికి, పరివర్తన క్రమానికీ యోగ్యతగా నిలిచే అమ్మలు స్ఫూర్తిదాతలు.. ఆమె నవ్వులే ఓ గొప్ప వెలుగు రేఖలు.. కనుక అమ్మ జాగ్రత్త అమ్మ నవ్వు జాగ్రత్త.. తల్లీ నీకు వందనం.. ఈ ఆదివారాన..యోగ్యత నిండిన ఆనందం మాకు ప్రసాదించండి మీరు.. లవ్ యూ మా..