Begin typing your search above and press return to search.

ఎన్‌ కౌంట‌ర్లు చేయించే సీఎం ముందే త‌ల్లి, బిడ్డ పెట్రోల్ పోసుకొని...!

By:  Tupaki Desk   |   18 July 2020 2:05 PM GMT
ఎన్‌ కౌంట‌ర్లు చేయించే సీఎం ముందే త‌ల్లి, బిడ్డ పెట్రోల్ పోసుకొని...!
X
యోగి ఆదిత్య‌నాథ్‌ - ఈ ఫైర్‌ బ్రాండ్ సీఎం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. అధికార కైవ‌సం చేసుకున్న అనంత‌రం నుంచి త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నారు. నేర‌స్తుల పాలిట సింహ‌స్వ‌ప్నం అవుతున్నారు. అనేక ఎన్‌ కౌంట‌ర్లే దీనికి నిద‌ర్శ‌నం. క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తుల‌ను కాల్చిపారేసేలా ఆర్డ‌ర్లు వేస్తున్న ఈ సీఎం ఇంటి ముందే..ఓ త‌ల్లి - బిడ్డ పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చ‌నిపోయేందుకు సిద్ధ‌మ‌య్యారు. యూపీ సీఎం క్యాంప్‌ ఆఫీస్ ఓ మహిళ తన కూమార్తెతో కలిసి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం వారికి చికిత్స అందుతోంది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గ‌తంలో ఎంపీగా గెలుపొందిన అమేథికి చెందిన ఒమ‌న్ అనే మ‌హిళ‌కు భూ స‌మ‌స్య‌లు ఉన్నాయి. త‌మ స‌మ‌స్య గురించి సీఎంకు విన్న‌వించుకుంటామంటూ ఒమ‌న్ త‌న కుమార్తెతో క‌లిసి సీఎం క్యాంప్ కార్యాల‌యానికి వ‌చ్చింది. కొద్దిసేప‌టికే భూ వివాదం విష‌యంలో త‌మ‌కు ఆన్యాయం జ‌రిగింద‌ని ఆరోపిస్తూ ఒమ‌న్ ఆమె కుమార్తె తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. హైసెక్యూరిటీ జోన్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న సిబ్బంది వెంట‌నే మంట‌లు ఆర్పేందుకు ప్ర‌య‌త్నించారు. సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉన్న అంబులెన్స్‌లో ఆ ఇద్దరినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన ఆ తల్లి కూతుళ్ల ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్లడించారు. కాగా, సీఎం క్యాంప్‌ ఆఫీసు దీనిపై స్పందించింది. త‌ల్లి,కూతూరు ఆందోళ‌న‌కు దిగి పెట్రోల్ పోసుకునే ముందు సీఎంను క‌ల‌వ‌లేద‌ని తెలిపారు. జ‌రిగిన ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొంటూ, వారి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.