Begin typing your search above and press return to search.

దారుణం:కరోనా భయంతో తల్లి శవాన్ని కూడా!

By:  Tupaki Desk   |   8 April 2020 8:10 AM GMT
దారుణం:కరోనా భయంతో తల్లి శవాన్ని కూడా!
X
కరోనా వైరస్ ..అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ మహమ్మారి కి ఇంకా మందు లేదు. కేవలం సామజిక దూరం పాటించడం ఒక్కటే మార్గం. అయితే ఈ కరోనా వల్ల చాలా చోట్ల దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మనుషుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ వస్తుండగా ... మరో అడుగు ముందుకేసి కన్న తల్లి కరోనా వల్ల చనిపోతే కనీసం శవాన్ని తీసుకెళ్లడానికి కూడా నిరాకరించాడు ఒక ప్రబుద్దుడు.ఈ ఘటన పంజాబ్ లోని లూథియానా లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు చూస్తే ...షిమ్లాపురి గ్రామానికి చెందిన వృద్ధురాలుకి కరోనా లక్షణాలు ఉండటం తో , ఆమెని మార్చి 31న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గత ఆదివారం ఆమె కరోనాతో మృతి చెందారు. ఆ విషయాన్ని కొడుకుకి తెలియజేసి - మృతదేహాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పగా ..దానికి అతడు నిరాకరించారు. ఆమెకి హాస్పిటల్ బిల్లు రూ.3.5లక్షలు అయింది. అది కూడా కట్టాల్సిన అవసరం లేదని హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. అడ్మినిష్ట్రేషన్ బిల్లు కడుతుందని.. డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చినా కుటుంబ సభ్యులు రాలేదు.

తనను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి మృతదేహాన్ని ముట్టుకుంటే తనకూ, తన కుటుంబ సభ్యులకు ఎక్కడ కరోనా సోకుతుందనే భయంతో తల్లి శవాన్ని కూడా ముట్టుకోవడానికి నిరాకరించాడు.ఈ విషయమై అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ మాట్లాడుతూ..మృతదేహం నుంచి ఇన్ ఫెక్షన్ సోకకుండా అవసరమైన రక్షణ కవచాన్ని కూడా ఇస్తామన్నా కూడా ఆ కన్న కొడుకు వినలేదని.ఆమె మృత దేహం చూడడానికి ఆమె కన్న కొడుకు కానీ, బంధువులు కానీ రాలేదని తెలిపారు. వారికీ ఎంతగా చెప్పినప్పటికీ కూడా రాక పోవడంతో చివరికి చేసేదేమీ లేక.నిన్న అర్ధరాత్రి జిల్లా అధికారులే అంత్యక్రియలను నిర్వహించారు. అయితే , చివరి నిముషం లో వచ్చి - మృతదేహాన్ని కూడా చూడకుండా - కుమారుడు - బంధువులు 100 మీటర్ల దూరం లో నిలబడి వీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఏదేమైనా కూడా ఈ కరోనా వల్ల ..అందరూ ఉండి కూడా ఎవరు లేనట్టుగా ఆమె అంత్యక్రియలు జరగడం అందరిని కలచి వేస్తుంది.