Begin typing your search above and press return to search.
పిల్లాడిని సూట్ కేసు పై పడుకోబెట్టి లాక్కెళ్తున్న మహిళ..వివరణ కోరిన NHRC!
By: Tupaki Desk | 16 May 2020 7:00 AM GMTవైరస్ ను అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల వేలాది కి.మీ కాలి నడకనే సాగిపోతున్న వలస కార్మికుల వ్యథల గురించి ఎంత వర్ణించినా తక్కువే. తాజాగా వలస కార్మికుల్లో ఓ మహిళ చిన్నారిని సూట్ కేసుపై పడుకోబెట్టి లాక్కెళ్లుకుతున్న ఫొటో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనితో ..ఆ ఫోటో పై జాతీయ మానవ హక్కుల సంఘం పంజాబ్ - ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు పంపింది.
హక్కుల ప్యానెల్ శుక్రవారం ప్రస్తుత పరిస్థితిపై స్టేట్ మెంట్ విడుదల చేసింది. లాక్ డౌన్ సమయంలో తలెత్తిన సమస్య ఏదైనా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ చిన్నారి కష్టం - ఆ కుటుంబం పడుతున్న బాధ అందరికీ కనిపిస్తుంది కాని స్థానిక ప్రభుత్వానికి మాత్రం కాదు అని NHRC చెప్పుకొచ్చింది. స్థానిక ప్రభుత్వాలు వెంటనే ఆ కుటుంబానికి సాయం చేయాలి. ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఎన్ హెచ్ ఆర్సీ తెలిపింది.
దీనిపై పంజాబ్ - ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీలు - ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ను 4వారాల్లో రిపోర్టు అందజేయాలని ఆదేశించాం అని, ఈ పరిస్థితికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి సహకారం తో పాటు కొంత సాయం కూడా అందించాలి అని కమిషన్ తెలిపింది. లాక్ డౌన్ సమయంలో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది అని, దీనిపై కేంద్రం - రాష్ట్రం పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తూనే ఉందని కమిషన్ తెలిపింది.