Begin typing your search above and press return to search.

అందుకే కూతుర్నిఅలా చంపేసిందట

By:  Tupaki Desk   |   8 July 2016 4:23 PM GMT
అందుకే కూతుర్నిఅలా చంపేసిందట
X
పరువు హత్యల గురించి వినటమే కానీ.. అనుభవంలోకి రావటం అరుదు. తాజాగా కృష్ణాజిల్లాలో చోటు చేసుకున్న పరువు హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. ప్రేమించిందన్న కారణంగా కూతుర్ని చంపేసిన తల్లి (బీబీజానీ) వైఖరి పెద్ద షాకింగ్ గా ఉంటే.. తన కూతుర్ని తాను ఎందుకు చంపానన్న విషయంపై ఆ తల్లి నోరు తెరిచింది. తన కుమార్తె నజ్మా ఒక పెళ్లి అయిన వ్యక్తి (దీపక్)ను ప్రేమించిందని.. అలా చేయొద్దని తాను వేడుకున్నట్లుగా ఆమె చెప్పింది.

అయితే.. తాను కావాలని చంపలేదని.. పెళ్లి అయిన వ్యక్తితో ప్రేమలో పడిందన్న కోపంతోనే చంపినట్లుగా పేర్కొంది. ముఖంపై దిండును అదిమిపెట్టి హత్య చేసినట్లుగా ఒప్పుకున్న ఆమె.. తన కుమార్తె ప్రియుడైన దీపక్ గురించిన వివరాల్ని బయటపెట్టింది. దీపక్ ను పిలిచి తన కూతురి జీవితాన్ని నాశనం చేయొద్దని వేడుకున్నానని.. కానీ అతను ఒప్పుకోలేదంది.

తన కుమార్తెతో పెళ్లి జరిపించని పక్షంలో ఆమెతో తాను దిగిన ఫోటోల్ని నెట్ లో పెడతానని బెదిరించాడని.. అందుకే తానీ పని చేయాల్సి వచ్చిందని వాపోయింది. బీబీజానీ చెప్పిన సమాచారంతో పోలీసులు దీపక్ ను అదుపులోకి తీసుకొని.. విచారిస్తున్నారు. కుమార్తె తప్పు చేస్తే మాత్రం ప్రాణాలు తీసేయటమేనా? తల్లిప్రేమంటే..?