Begin typing your search above and press return to search.
ఇదెక్కడి పోయే కాలం.. ఏడుస్తున్నారంటూ నెలలపిల్లల్ని చంపేసిన తల్లి
By: Tupaki Desk | 4 Jun 2022 12:59 AM GMTపొత్తిళ్లలోని పిల్లలు ఏడుస్తుంటే తల్లడిల్లిపోతుంది తల్లి మనసు. ఏమైందో చిట్టికన్నలకు అంటూ వేదన చెందుతుంది. తన పిల్లల ఏడుపు తగ్గే వరకు తను ఆందోళనలోనే మునిగిపోతుంది. చంటి పిల్లల ఏడుపును ఇంటి పెద్దలు గుర్తించి సర్ది చెప్పినా.. ఎంత కష్టం వచ్చిందనే వేదనతో ఉంటుంది. అలాంటి అమ్మతనానికి మచ్చగా మారింది మహారాష్ట్రకు చెందిన ఒక కసాయి తల్లి వ్యవహారం.
నెలలు కూడా నిండని పిల్లలు ఏడుస్తున్నారన్న కారణంతో వారిని మరింత బాగా చూసుకోవాల్సింది పోయి.. వారి ఏడుపును భరించలేనంటూ చంపేసిన దుర్మార్గం తాజగా చోటు చేసుకుంది. అంతేకాదు..గొంతు నులిమి చంపేసిన తర్వాత వారి డెడ్ బాడీలను పొలంలో కాల్చేసిన రాక్షస చర్య ఇప్పుడు షాకింగ్ గా మారింది. అమ్మతనానికి మచ్చగా మారిన ఈ పిశాచి తల్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మహారాష్ట్రలోని భోకర్ లోని పాండుర్నా గ్రామానికి చెందిన దుర్పదాబాయ్ కు రెండేళ్ల కుమారుడు దత్తాతో పాటు నాలుగు నెలల అనసూయ అనే చిన్నారి ఉంది. అయితే.. పిల్లలు ఇద్దరు ఆపకుండా ఏడస్తున్న వైనంపై ఆగ్రహానికి గురైంది.
ఇందులో భాగంగా మే 31న నాలుగు నెలల కుమార్తె అనసూయ గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాతి రోజున ఆకలితో తిండి కోసం ఏడ్చిన నాలుగేళ్ల కుమారుడ్ని సైతం చంపేసింది.
కొడుకును గొంతు నులిమి చంపేసిన ఆమె.. తర్వాత తన తల్లి.. సోదరుడ్ని పిలిపించుకొని వారి డెడ్ బాడీలను పొలంలో కాల్చేశారు. ఈ విషయం బయటకు రావటంతో పోలీసులు సైతం విస్మయానికి గురవుతున్నారు.
ఈ కసాయి తల్లితో పాటు.. ఆమెకు సహకరించిన ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మతానికి మచ్చగా మారిన ఈ ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది. ఇదెక్కడి పోయేకాలం అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.