Begin typing your search above and press return to search.
అక్రమ సంబంధం కోసం కొడుకును చంపిన తల్లి
By: Tupaki Desk | 8 Oct 2020 2:30 AM GMTఈ టెక్ జమానాలో అరచేతిలో స్మార్ట్ ఫోన్ తో ప్రపంచాన్ని చుట్టేయగలుగుతున్నాం. అందివచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నవారికంటే దుర్వినియోగం చేస్తున్నవారే ఎక్కువ. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం....సోషల్ మీడియా వాడకం....వింతపోకడలు వెరసి....అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. క్షణికావేశంలో ...క్షణికానందం కోసం అక్రమ సంబంధాలు నెరుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారు కొందరైతే...తమ అక్రమ సంబంధాలకు అడ్డువస్తున్నారన్న కారణంతో కుటుంబ సభ్యులను కడతేరుస్తున్న వారు మరికొందరు. తాజాగా కృష్ణా జిల్లాలో ఓ మహిళ....ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డనే కర్కశంగా హత్య చేసి అడ్డు తొలగించుకున్న ఘటన పెను దుమారం రేపింది. వింటేనే ఒళ్లు గగుర్పొడిచేలా....కన్న కొడుకును ప్రియుడిసాయంతో కలిసి హత్య చేసిందో కసాయి తల్లి. అంతేకాదు, సినీ ఫక్కీలో ఆంధ్రాలో హత్య చేసి....తెలంగాణాలో శవాన్ని పాతిపెట్టేందుకు ప్రయత్నించారీ కఠినాత్ములు. వారి బండారం బయటపడడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కబెెడుతున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లికి చెందిన ఓ మహిళ గత రెండు నెలలుగా భర్తతో విడిపోయి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఆ మహిళ తన ఇద్దరు కుమారులను తన వద్దే ఉంచుకుంది. అయితే, ప్రియుడి మోజులో పడ్డ ఆ మహిళ...తమకు అడ్డుగా మారిన చిన్నకొడుకును కడతేర్చాలనుకుంది. పథకం ప్రకారం వారిద్దరూ కలిసి అన్యం పుణ్యం ఎరుగని పసిబిడ్డ ప్రాణాలు తీశారు. చావుతెలివితేటలతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ బాలుడి మృతదేహాన్ని తెలంగాణలోని కోదాడ వద్ద పూడ్చి పెట్టారు. ఈ క్రమంలో వారి వ్యవహార శైలిపై స్థానికులకు అనుమానం వచ్చింది. స్థానికుల సమాచారంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో, తామే ఈ ఘోరానికి పాల్పడ్డామని వారిద్దరూ అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.