Begin typing your search above and press return to search.
వేరే మతస్తుడ్ని లవ్ చేసిందని తల్లే చంపేసింది
By: Tupaki Desk | 7 July 2016 5:43 AM GMTకనురెప్ప కంటిని కాటేయటం ఇంతకు ముందు వినలేదు. కానీ.. నిలువెత్తు మూర్ఖత్వం అమ్మతనానికి మచ్చ తెచ్చేలా చేసిన ఉదంతం విజయవాడలో చోటు చేసుకుంది. వేరే మతానికి చెందిన అబ్బాయిని తన కుమార్తె ప్రేమిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న కన్నతల్లి.. తన కూతుర్ని చంపేందుకు వెనుకాడలేదు. గుట్టుగా చంపేసి.. అనారోగ్యంతో చనిపోయిందన్న నాటకంతో తప్పించుకునే ప్రయత్నం చేసి దొరికిపోయిన ఈ దుర్మార్గపు తల్లి ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
కృష్ణా జిల్ల కంచికచర్లకు చెందిన బీబీజాన్ కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె నజ్మా ఒక యువకుడి ప్రేమలో పడిందని అనుమానించింది. దీంతో.. కుటుంబాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేటకు మార్చేసింది. అయినా.. కుమార్తె తీరు మారకపోవటంతో మూడు నెలల కిందట మళ్లీ విజయవాడకు వచ్చేశారు. అప్పటికే పలుమార్లు చెప్పినా కుమార్తె తీరులో మార్పు రాలేదు. దీంతో.. ఆగ్రహం చెందిన బీబీజాన్ కుమార్తెను చంపేందుకు ప్లాన్ చేసింది.
భర్తను బయటకు పంపిన ఆమె.. నజ్మా ముఖం మీద దిండుతో గట్టిగా అదిమేసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం.. తన కుమార్తె తీవ్రమైన కడుపు నొప్పితో చనిపోయిందని అందరికి చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న నజ్మా హటాత్తుగా చనిపోవటం కొందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉండగా నజ్మా మరణంపై ఆమె ప్రియుడికి అనుమానం కలిగింది. వెంటనే అతడు సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నజ్మా మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నజ్మాది హత్యగా తేలింది. దీంతో పోలీసులు విచారణ జరపటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఎంత ఇతర మతస్తుడ్ని ప్రేమిస్తే మాత్రం కన్న కూతుర్ని అంత కసాయితనంతో చంపేస్తారా? అని పలువురు దిగ్ర్బాంతికి గురయ్యారు.