Begin typing your search above and press return to search.

8 పిల్లల తల్లి.. 57 ఏళ్ల ప్రియుడితో వెళ్లిపోయింది.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   2 May 2022 6:28 AM GMT
8 పిల్లల తల్లి.. 57 ఏళ్ల ప్రియుడితో వెళ్లిపోయింది.. ఎక్కడంటే?
X
గతానికి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దాంపత్య జీవనానికి సవాళ్లు విసిరే పరిణామాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతంలో దేశంలోని దంపతులు తమకు కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా తమలో తాము కుమిలిపోతూ ఉండిపోయే వారు తప్పించి.. దాంపత్య బంధనాల్ని తెంచుకోవాలన్న ప్రయత్నం ఉండేది కాదు. కానీ.. గడిచిన పదేళ్లలో అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. గతంలో మాదిరి గమ్మున ఉండకుండా.. తమ మనసుకు నచ్చని వారితో కలిసి ఉండేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు.

నలభై ఏళ్ల కిందట ఇలాంటివి మగాళ్లలో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వచ్చిన మార్పు ఏమంటే.. మహిళలు సైతం భర్త తీరు నచ్చకున్నా.. భర్త కంటే మెరుగ్గా ఉండే వ్యక్తితో అనుబంధం పెరిగితే.. దాంపత్య బంధంలోకి వెళ్లిపోవటానికి ఏ మాత్రం సంకోచించటం లేదు. ఇలాంటి సందర్భాల్లో అడ్డుగా ఉండే పిల్లలు లాంటి భావోద్వేగ బంధాలకు సైతం వారు చెల్లుచీటి ఇచ్చేస్తున్నారు. తాజా ఉదంతం గురించి తెలిసినంతనే ఇలాంటి భావన రావటం ఖాయం.

ఎనిమిది మంది పిల్లల తల్లి ఒకరు తాజాగా భర్తకు.. పిల్లలకు గుడ్ బై చెప్పేసి.. తన మనసుకు నచ్చిన 57 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. అదే సమయంలో.. దేశంలోమారుతున్న దాంపత్య బంధానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా నిలిచిందని చెప్పాలి. రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. భరత్ పురకు సమీపంలోని నీమల అనే గ్రామం ఉంది. అక్కడ ఎనిమిది మంది పిల్లల తల్లి ఒకరు తాజాగా తనకీ సంసారం వద్దనుకొని.. పెద్ద వయస్కుడైన 57 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయిన వైనం కలకలాన్ని రేపింది.

దీంతో భర్త రంగంలోకి దిగి.. తన భార్యకు తాయిత్తు ఇచ్చి వశపర్చుకున్నాడని.. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినట్లుగా పేర్కొంటూ న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళ్లారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను.. ఆమెను తీసుకెళ్లిన వ్యక్తిని స్టేషన్ కు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో ఆమె కోర్టుకు తన వాదనను వినిపించింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తన ఇష్టంతోనే తాను ఇంటిని వదిలిపెట్టి వెళ్లినట్లుగా తేల్చి చెప్పారు.

ఇంతకీ 57 ఏళ్ల వ్యక్తితో ఎనిమిది మంది పిల్లలున్న తల్లికి పరిచయం ఎలా జరిగింది? ఇంత దూరం ఎలా వెళ్లిందన్న విషయానికి వస్తే.. సదరు వ్యక్తి వీరి ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడు. ఆమె తరచూ అతడి ఇంటికి ఏదో పని మీద వెళ్లేది. పిల్లల బాధ్యతతో విసిగిపోయిన ఆమె భర్త నిరాదరణ మరింత వేదనకుగురి చేసిందని చెబుతున్నారు. ఆ ఫస్ట్రేషన్ లో ఉన్న ఆమెకు.. 57 ఏళ్ల వ్యక్తికి దగ్గరైంది. వారి మధ్య ప్రేమ మరో స్థాయికి చేరటంతో కలిసి బతికేందుకు వీలుగా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. తాను ఇంటికి తిరిగి వెళ్లలేనని.. భర్త.. పిల్లలు తనకు వద్దని కరాఖండిగా చెప్పేయటం గమనార్హం.