Begin typing your search above and press return to search.

అమెరికా బాంబు క‌థ మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   14 April 2017 11:09 AM GMT
అమెరికా బాంబు క‌థ మామూలుగా లేదు
X
అగ్ర‌రాజ్యం అమెరికా దూకుడు పెంచింది. మొన్న‌టికి మొన్న సిరియాపై తోమ‌హాక్ మిస్సైల్స్‌ తో దాడి చేసిన అగ్ర‌రాజ్యం.. ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్థాన్‌ లోని ఐసిస్ స్థావ‌రాల‌పై విరుచుకుప‌డింది. దీనికోసం ఏకంగా మ‌ద‌ర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ గా పిలిచే జీబీయూ-43నే వాడ‌టం గ‌మ‌నార్హం. అమెరికా ఈ బాంబును వాడ‌టం ఇదే తొలిసారి. నిజానికి ఈ బాంబును మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్ (MOAB) అంటారు. అయితే దాని షార్ట్ ఫార్మ్‌ ను బ‌ట్టి ముద్దుగా మ‌ద‌ర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుస్తారు. ఇది అతి పెద్ద నాన్ న్యూక్లియ‌ర్ బాంబ్ అని పెంట‌గాన్ వెల్ల‌డించింది.

ఈ బాంబు విశేషాలు ఇవి...

- దీని బ‌రువు సుమారు 9800 కిలోలు. జీపీఎస్ గైడ్ చేస్తుంది. 20 అడుగుల పొడ‌వు ఉంటుంది. ఇది భూమిలోకి 200 అడుగుల‌లోతుకు - కాంక్రీట్ అయితే 60 అడుగుల లోనికి దూసుకెళ్లిన త‌ర్వాత పేలుతుంది.

- 2003లో ఇరాక్‌ పై అమెరికా దాడి చేస్తున్న స‌మ‌యంలో తొలిసారి ఈ బాంబును ప‌రీక్షించారు.

- ఈ బాంబును ప‌రీక్షించిన‌పుడు ఏర్ప‌డిన మ‌ష్రూమ్ మేఘాన్ని 32 కిలోమీట‌ర్ల దూరం నుంచి కూడా చూడ‌గ‌లిగామ‌ని యూఎస్ ఎయిర్‌ ఫోర్స్ తెలిపింది.

- ఆఫ్ఘ‌నిస్థాన్‌ లోని ఐసిస్ కేవ్స్ అండ్ బంక‌ర్స్ హౌజింగ్ ఫైట‌ర్స్‌ పై తాజాగా అమెరికా ఈ బాంబును జార విడిచింది.

- లాక్‌ హీద్ ఎంసీ-130 ట్రాన్స్‌ పోర్ట్ ప్లేన్ నుంచి ఈ బాంబును జార‌విడిచారు.

- ఈ బాంబు రూపుదిద్దుకుంటున్న క్ర‌మంలో దీనిని అత్యంత శ‌క్తివంత‌మైన నాన్ న్యూక్లియ‌ర్ బాంబుగా అభివ‌ర్ణించారు.

- అయితే ఇదే అతి పెద్ద బాంబు మాత్రం కాదు. 2007లో ర‌ష్యా ఏవియేష‌న్ థెర్మోబారిక్ బాంబ్ ఆఫ్ ఇన్‌ క్రీజ్‌ డ్ ప‌వ‌ర్ పేరుతో ఓ బాంబును ప‌రీక్షించింది. దీనికి ఫాద‌ర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ గా పేరు పెట్టారు. ఇది మ‌ద‌ర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ క‌న్నా నాలుగు రెట్లు శ‌క్తివంత‌మైన‌దిగా భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/