Begin typing your search above and press return to search.
శివగామి మాదిరి బిడ్డ ప్రాణాల్ని కాపాడింది
By: Tupaki Desk | 10 Oct 2015 3:58 AM GMTరీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో శివగామి పాత్రను సజీవంగా పోషించి.. నిర్జీవంగా మారిన ఒక మాతృమూర్తి ఉదంతం ఇది. బాహుబలి సినిమాలో చిన్నారి ప్రభాస్ ను కాపాడేందుకు.. రమ్యకృష్ణ (శివగామి) పాత్ర నది నీటిలో కొట్టుకుపోతూ.. పిల్లాడికి ఏమీ కాకూడదన్న ఉద్దేశ్యంతో ఒంటి చేత్తో పిల్లాడ్ని పైకి పట్టుకొని.. ప్రయాణించటం.. చివరకు మరణించటం తెలిసిందే.
సరిగ్గా అలాంటి ఉదంతమే ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కదంకంలో పడిన ఒక మహిళ.. తన బిడ్డను కాపాడేందుకు అచ్చు శివగామిలా వ్యవహరించి..బిడ్డ ప్రాణాల్ని నిలిపి.. తాను మాత్రం ప్రాణాలు విడిచింది.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దిగువకన్ని కాపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. గ్రామానికి చెందిన రామకృష్ణ బెంగళూరులో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడి భార్య భువనేశ్వరి (23) మాత్రం గ్రామంలోనే ఉంటూ పశువులు కాస్తుంటుంది. వీరికి రెండేళ్ల పిల్లాడు ఉన్నాడు. నిత్యం బిడ్డను చంకనేసుకొని పశువులను కాసేందుకు బయటకు వెళుతుంటుంది.
ఎప్పటిమాదిరి బయలుదేరిన ఆమెకు.. ఇటీవల వర్షాల కారణంగా అటవీశాఖాధికారులు తవ్విన కందకంలోకి దిగింది. లోతు ఎంత ఉంటుందో తెలీకున్నా దిగిన ఆమె.. తాను దిగింది లోతున్న కందకంలోకి అన్న విషయం తెలిసి అప్రమత్తమైంది. అయితే.. అప్పటికే ఆమె ప్రమాదంలోకి చిక్కుకుపోయినట్లు తెలిసినట్లుంది. తాను మునిగిపోతున్నా.. బిడ్డనుకాపాడాలన్న ఉద్దేశ్యంతో చంకలో ఉన్న పిల్లాడ్ని ఒడ్డు వైపునకు వదిలేసింది. ఏడుస్తూ పిల్లాడు.. తల్లి వైపునకు వచ్చే క్రమంలో భువనేశ్వరి బంధువులు చూడటంతో పిల్లాడు బతికిపోయాడు. తన ప్రాణం పోతున్నా.. తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకుప్రయత్నించిన భువనేశ్వరిని రియల్ శివగామిలా సదరు గ్రామంలో పలువురు కీర్తిస్తున్నారు.