Begin typing your search above and press return to search.
వద్దన్నా కేసీఆర్ వద్దకు మోత్కుపల్లి.. స్పందించిన బీజేపీ
By: Tupaki Desk | 27 Jun 2021 12:30 PM GMTసీఎం కేసీఆర్ సడెన్ గా దళితులపై ప్రేమ కురిపిస్తున్నాడన్న టాక్ తెలంగాణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. యాదాద్రిలో లాకప్ డెత్ కు గురైన దళిత మహిళ మరియమ్మ విషయంలో కేసీఆర్ స్పందించిన తీరు.. తాజాగా ఈరోజు సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి సంబంధించి ప్రగతి భవన్ లో అఖిల పక్ష సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. తమ పార్టీ తరుఫున ఎవరూ హాజరు కారని తెలిపింది. అయినా బీజేపీని ధిక్కరించి ఓ సీనియర్ నేత కేసీఆర్ మీటింగ్ కు వెళ్లడం సంచలనమైంది.
బీజేపీ వద్దన్నా కూడా బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పెద్ద చర్చగా మారింది. దీనిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు. సమాచారం లోపం ఏమీ లేదని.. సీఎం కేసీఆర్ సమావేశానికి బీజేపీ వద్దన్నా ఆయన వెళ్లాడని.. అలా వెళ్లకుండా ఉండాల్సింది అని వివేక్ చెప్పుకొచ్చారు. అఖిలపక్షానికి వెళ్లిన మోత్కుపల్లి దళితులకు కేసీఆర్ చేసిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఎందుకు చేయలేదు అని అడగాలని వివేక్ తాజాగా మోత్కుపల్లికి సూచించారు. దళితులకు మూడు ఎకరాలు ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించాలని కూడా సూచించారు.
అయితే కేసీఆర్ సమావేశానికి బీజేపీ వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి దీనిపై స్పందించలేదు. ఆయన ఎమంటారన్నది ఆసక్తి రేపుతోంది.