Begin typing your search above and press return to search.
రాహుల్ తగ్గలేదబ్బా..కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ గా వోరా
By: Tupaki Desk | 3 July 2019 1:11 PM GMTతాజా ఎన్నికల్లో ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాద్యతల నుంచి తప్పుకుంటానంటూ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్న రాహుల్ గాంధీ పార్టీ నేతల బుజ్జగింపులకు ఏమాత్రం తలొగ్గలేదు. తాను అనుకున్నట్లుగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారేశారు. అంతేకాకుండా తన రాజీనామా పత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన... రాజీనామాపై మరో మాట లేదంటూ సంచలన ప్రకటన చేశారు. ఓ వైపు పార్టీలో అత్యున్నత కీలక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) భేటీ జరుగుతుండగానే... బుధవారం రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకోకవడం గమనార్హం.
తాజా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ ఓటమికి తనదే బాధ్యత అంటూ రాజీనామా చేస్తానంటూ రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ ను రాజీనామా చేయకుండా నిలువరించేందుకు పార్టీ నేతలు తమదైన శైలి యత్నాలు చేశారు. స్వయంగా యూపీఏ చైర్ పర్సన్ - తన మాతృమూర్తి సోనియా గాంధీ కూడా రంగంలోకి దిగి రాజీనామా నుంచి రాహుల్ ను దారి మళ్లించేందుకు యత్నించారు. అయినా కూడా రాహుల్ తన మనసు మార్చుకోలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు పార్టీని మరింతగా క్షీణింపజేస్తాయని సీనియర్లు ఎందరు చెప్పినా రాహుల్ మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఈ క్రమంలోనే ఆయన రాజీనమాపై ఇదివరకే తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారేశారు. ఈ మేరకు తాను రాసిన నాలుగు పేజీల రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి సంచలనం రేపారు.
రాహుల్ నిర్ణయంతో సీడబ్ల్యూసీ కూడా ఇక ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించక తప్పలేదు. ఇప్పటికిప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నిక చేయడం అంత సులభం కాదన్న నేపథ్యంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరాను నియమిస్తున్నట్లుగా సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి గాంధీ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా పేరున్న మోతీలాల్... పార్టీలో కీలక బాధ్యతలు ఎన్నింటినో నిర్వర్తించారు. పార్టీ కోశాధికారి పదవిలో వోరా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. పార్టీ ఆర్ధిక వ్యవహారాలన్నీ కూడా వోరా చేతుల మీదుగానే నడిచేవన్న రీతిలో ఆయన పార్టీ కోశాధికారిగా తనదైన శైలి ముద్ర వేశారు. చత్తీస్ ఘడ్ కోటా నుంచి రాజ్యసభలో సభ్యుడిగా కొనసాగుతున్న వోరా... ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే దాకా తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.