Begin typing your search above and press return to search.

సమాధి నుంచి కదలికలు.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   25 July 2019 8:46 AM
సమాధి నుంచి కదలికలు.. వీడియో వైరల్
X
సమాధి మధ్యలో కదలికలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లి దర్గా దగ్గర ఈ సమాధి ఉంది. అందులో కదలికలు వస్తున్నాయని సమాధిలోని మనిషి మృతదేహానికి తిరిగి ప్రాణాలు వచ్చాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారులు చేరుకొని పరిశీలించారు. సమాధి నుంచి కదలికలే కాకుండా శబ్దం కూడా వస్తుందని గుర్తించారు. కొందరు ఔత్సాహికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

నెల్లూరు జిల్లా లింగంపల్లిలో మాసుంసావలి దర్గాలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. చనిపోయిన మాసుంసావలి బాబా దేవుడిగా అవతరించాడని అక్కడ పూజలు చేయడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదంతా ఆ దర్గా మహత్య్మంగా చెప్పుకుంటున్నారు.

గతంలోనూ ఇలానే కదలికలు రావడంతో అధికారులు, నిపుణులు, జనవిజ్ఞాన వేదికలు దీన్ని పరిశీలించారు. దీనికి గల కారణాలు తేల్చారు. సమాధి చేసిన బాబా సమాధిలో ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుందని.. వేడి తీవ్రత కారణంగా సమాధిలో ఒకరకమైన రసాయన చర్యలు ఏర్పడుతాయని.. అక్కడి నుంచి గాలి పైకి తన్నుకుంటూ వస్తుందని.. అదే బుడగలు లాగా కదిలినట్టు పైకి కనిపిస్తుందని తెలిపారు. ఇది ఎలాంటి మహత్య్మం కాదని.. కేవలం సైంటిఫిక్ గా జరిగిన ఒక రసాయన చర్య అని కొట్టిపారేశారు. అయితే ప్రజలు మాత్రం ఇదో అద్భుతమని దైవాంస సంభూతుడు బాబా అని పూజలు చేస్తున్నారు.

కాగా గతంలో నెల్లూరు జిల్లా వేనాడులో కూడా ఇలానే సమాధి నుంచి గాలి బయటకు రావడం..ఊపిరి తీసుకుంటున్నట్టు ఒక ఘటన జరిగింది. ఇప్పుడు తాజాగా ఘటన మరింత వైరల్ గా మారింది.