Begin typing your search above and press return to search.
గవర్నర్ గారు జంప్
By: Tupaki Desk | 7 Aug 2015 4:53 PM GMT"తెలుగుదేశం గవర్నర్" మోత్కుపల్లి నర్సింహులు ఎక్కడ? ఆయనకు గవర్నర్ పీఠం దక్కుతుందని, ఒక దశలో ఆయన ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ర్టాలకే ఉమ్మడి గవర్నర్‌గా వస్తారని తెలుగుతమ్ముళ్లు సహా ఆ పార్టీ నేతలు ఒక రేంజ్ లో డప్పుకొట్టారు. ఆఖరికి ఆయనకు గవర్నర్ గిరీ కాదు కదా కనీసం ఏ నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. మార్చి, ఏప్రిల్ లలో జోరుగా సాగిన ఈ ప్రచారం....తెలుగుదేశం మహానాడు జరిగే మే నెల వరకు పీక్ స్టేజీకి వెళ్లింది. అయినా పదవి దక్కకపోవడంతో మోత్కుపల్లి మహానాడు సభ వేదికగా తనకు గవర్నర్ గిరీ ఎపుడు ఇస్తారంటూ బాబును ప్రాధేయపడుతూ అడిగారు. అంతా గవర్నర్ అంటుంటే...ఇబ్బందిగా ఉందని వాపోయారు.
అయితే నమ్మించి మోసం చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు మోత్కుపల్లి మొరకు కరగలేదు. పైగా ఆయన్ను పట్టించుకోను కూడా లేదు. చంద్రబాబు బుద్ధిని లేటుగా అయినా గమనించిన మోత్కుపల్లి పార్టీ నుంచి సైడయిపోయారు. ఓటుకు నోటు కేసులో తీవ్రంగా దుమ్మెత్తిపోసే అవకాశం దొరికినా...అరిచేందుకు యమ ఆసక్తి చూపే మోత్కుపల్లి ఫ్రేములలో ఎక్కడా కనిపించలేదు. ఓటుకునోటు ఎపిసోడ్ తెరమీదకు వచ్చి రెండు నెలలు దాటుతున్నా...ఆయన అడ్రస్ లేదు. ఇంతకీ మోత్కుపల్లి ఎక్కడా?
చంద్రబాబు కుయుక్తులను గమనించిన మోత్కుపల్లి కావాలనే పార్టీ కార్యాలయానికి రావడం లేదని తెలంగాణ టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ లోఎంతకాలమైన తనను అరుపులకు, విమర్శలకే పరిమితం చేస్తారు తప్ప పదవులు దక్కవని మోత్కుపల్లి గ్రహించారట. అంతేకాదు.. ప్రభుత్వంపై విమర్శలు చేసి చెడ్డపేరు ఎందుకు తెచ్చుకోవాలని సైతం మోత్కుపల్లి మిన్నకున్నారని పచ్చపార్టీ తమ్ముళ్లు వివరిస్తున్నారు. ఇంతకీ మోత్కుపల్లి పార్టీలో ఉంటాడా....జెండా ఎత్తేస్తాడా అనేది తేలాల్సి ఉంది.