Begin typing your search above and press return to search.
మాజీ తెలుగు తమ్ముడికి ఇవే ఆఖరి ఎన్నికలట!
By: Tupaki Desk | 19 Sep 2018 10:44 AM GMTఎలాంటోడు ఎలా అయ్యాడన్న భావన కొన్నిసార్లు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. తాజాగా తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉందని చెప్పాలి. బాబును నమ్మి.. అడ్డంగా బుక్ అయిన నేతల్లో మోత్కుపల్లి ఒకరుగా చెబుతుంటారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ.. కేసీఆర్ ను విమర్శించే ధైర్యం ఎవరూ చేయని రోజుల్లో బాబుకు అండగా నిలుస్తూ మోత్కుపల్లి గులాబీ అధినేతపై ఫైర్ అయ్యేవారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కేసీఆర్ ను ధీటుగా విమర్శలు చేసిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు.
అలాంటి ఆయన రాష్ట్ర విభజన తర్వాత.. పార్టీకి తాను చేసిన సేవల్ని గుర్తుంచుకొని అధినేత చంద్రబాబు ఏదో ఒక పదవి ఇస్తారని ఎంతగానో ఎదురుచూశారు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ గిరి వచ్చేస్తుందన్న ఆశల పల్లకిలో తిరిగారు. ఆయన తిరుగుతుంటే.. ప్రోత్సహించిన వారిలో బాబు కూడా ఉన్నారు.
నమ్మించి.. అడ్డంగా బుక్ చేసే అలవాటున్న చంద్రబాబు పుణ్యమా అని.. మోత్కుపల్లి అడ్డంగా దొరికిపోయారు. గవర్నర్ గిరి తర్వాత.. చివరకు పార్టీ నుంచి వేటు వేయించుకునే వరకూ విషయం వెళ్లింది. తనను వాడుకొని వదిలేసిన బాబు తీరును ఆయన కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో మండిపడటం.. అవకాశం వచ్చిన ప్రతిసారీ.. ప్రతి వేదిక మీదా కడిగేయటం తెలిసిందే.
గడిచిన కొద్ది రోజులుగా బాబు తీరును అదే పనిగా తిట్టిపోస్తూ.. శాపాలు పెడుతున్న మోత్కుపల్లి తాజాగా తాను అలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఆలేరుకు గోదావరి జలాలు తీసుకురావటమే తన అంతిమ లక్ష్యమన్నారు. ఆలేరుకు గోదావరి జలాలు తీసుకొచ్చి తన రాజకీయ జీవితాన్ని ముగిస్తానని చెప్పిన ఆయన.. అందుకు వీలుగా ఈసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలన్నారు.
ఒక నియోజకవర్గానికి గోదావరి నీళ్లు తీసుకురావటం ఒక ఎమ్మెల్యే స్థాయికి సరిపోతుందా? లాంటి ప్రశ్నలు మనసులోకి రానివ్వకుండా.. మోత్కుపల్లి చివరి కోరికను ఆలేరు ఓటర్లు ఎంతవరకూ తీరుస్తారో చూడాలి.