Begin typing your search above and press return to search.

హోదా రావాలంటే..బాబు పోవాలి..జ‌గ‌న్ రావాలి

By:  Tupaki Desk   |   22 July 2018 10:13 AM GMT
హోదా రావాలంటే..బాబు పోవాలి..జ‌గ‌న్ రావాలి
X
టీడీపీ మాజీ సీనియ‌ర్ నేత - తెలంగాణ‌కు చెందిన ద‌ళిత నాయ‌కుడు మోత్కుపల్లి నర్సింహులు మ‌రోమారు తెలుగుదేశం అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై విరుచుకుప‌డ్డారు. ఒకింత గ్యాప్ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన మోత్కుప‌ల్లి ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై మ‌రిన్ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. చంద్రబాబు అధర్మ పోరాటంపై ధర్మ పోరాటాన్ని తిరుపతి నుంచి మొదలు పెట్టానని - దీన్ని కొన‌సాగిస్తాన‌ని తెలిపారు. ``నాకు 65 సంవత్సరాల వయస్సులో బాబు లాంటి దుర్మార్గుడిపై పోరాటం మొదలు పెట్టాను. నేను పుట్టిన గడ్డను జిల్లా చేసినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపాను. చంద్రబాబును ఓడించాలని తిరుపతిలో మెట్టు మెట్టుకు మొక్కిన - గాడ్సే కంటే బాబు నరహంతకుడు అని ఎన్టీఆర్ చెప్పారు. బాబు జీవితం అంత నటన - అవిశ్వాస సమయంలో ఏ ఒక్క పార్టీ చంద్ర బాబును పట్టించుకోలేదు`` అంటూ మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు.

14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దన్నది అని చెప్ప‌డంతో పాటుగా ప్యాకేజి ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పిన చంద్ర‌బాబు మళ్ళీ సిగ్గులేకుండా ప్రత్యేక హోదా అడుగుతున్నాడ‌ని మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు. `` ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వమని కేంద్రాన్ని కోరుతున్నాను. ప్రత్యేక హోదా రావాలంటే బాబు పోవాలి. జగన్ రాష్ట్రం కోసం రోడ్లమీద తిరుగుతున్నాడు. ఈసారి జగన్ ను ఆదరించాలి. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. ఎన్టీఆర్ కే కాకుండా ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు బాబు. దొంగతనాలు - దోపిడీలు కప్పిపుచ్చుకునేందుకే 27 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలిశాడు. బాబు లాంటి మోసగాడిపై అందరూ పోరాడాలి. అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి`` అని కోరారు.

చంద్రబాబే రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించాడని మోత్కుప‌ల్లి ఆరోపించారు. నేను కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంట నీవు వెళ్ళు అని రేవంత్ ను పంపించాడు అంటూ ఆస‌క్తిక‌ర విష‌యం తెలిపారు. ``నాకు బాబు ఏ పని చేయలేదు - నేనే చంద్రబాబుకు చాలా చేశాను. చాలా అపదల నుంచి బాబును కాపాడాను. నన్ను చంపిన పర్వాలేదు బాబుకు వ్యతిరేకంగా పోరాడుతా. బాబు సహకారం లేకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఒక్కో రాజ్యసభ సీటు 100 కోట్లకు అమ్ముకున్నాడు. బాబు 100 కోట్లు పెట్టి ఇళ్ళు కట్టుకొని రాజభోగాలు అనుభవిస్తున్నాడు. పాలు పెరుగు అమ్ముకుంటే కోట్లు వస్తాయా? బాబు ఆస్తులపై సీబీఐ విచారణ చేయించాలి`` అని డిమాండ్ చేశారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని, జగన్ కుటుంబంలో కులం లేదని అన్నారు. ``జగన్ కుటుంబం దళిత - పేదల కుటుంబం. ఇప్ప‌టివ‌ర‌కు హోదా కోసం, ఏపీ కోసం జగన్ మాట్లాడిందే గల్లా జయదేవ్ మాట్లాడారు. దీంతో క్రెడిట్ జగన్ కు వెళ్తుంది, నేనే పవన్ - జగన్ వెనుక ఉన్నాను. నా వెనుక ఎవరు లేరు``అని మోత్కుప‌ల్లి అన్నారు.