Begin typing your search above and press return to search.
బాబుకు శాపనార్థాలు పెట్టిన మోత్కుపల్లి
By: Tupaki Desk | 11 July 2018 4:24 AM GMTమోత్కుపల్లి మరోసారి గొంతు విప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు విన్నంతనే విరుచుకుపడుతున్న ఆయన తాజాగా మరోసారి తనకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే తన లక్ష్యమని స్పష్టంగా చెప్పటమే కాదు.. ఈ మధ్యన ఆయన చెప్పినట్లు తిరుమలకు ఆయన వచ్చారు.
తనను మానసికంగా చంద్రబాబు చంపేశాడని..నడివీధిలో తన గొంతు కోశారంటూ మోత్కుపల్లి విరుచుకుపడ్డారు. తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు మంగళవారం తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంటకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకున్న ఆయన బాబుపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ దయతో తాను తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్లు చెప్పిన మోత్కుపల్లి.. చంద్రబాబు ఓడిపోవాలన్న లక్ష్యంతోనే తాను తిరుమల కొండ మీద నడవనున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు లాంటి నేతలు రాజకీయాల్లో ఉండకూడదన్నారు.
రాజకీయాల్లో సేవకులు ఉండాలే కానీ దుర్మార్గులు ఉండకూడదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బాబు మళ్లీ అధికారంలోకి రాకూడదనే తాను తిరుమలకు నడుస్తున్నట్లు చెప్పారు. తనకు మోకాళ్ల నొప్పులు ఉన్నప్పటికి బాబు ఓడిపోవాలని తిరుమల శ్రీవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. మోత్కుపల్లికి రేణిగుంట విమానాశ్రయంలో జనసేన నేత డాక్టర్ పసుపులేని హరిప్రసాద్ స్వాగతం పలకటం గమనార్హం.
తనను మానసికంగా చంద్రబాబు చంపేశాడని..నడివీధిలో తన గొంతు కోశారంటూ మోత్కుపల్లి విరుచుకుపడ్డారు. తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు మంగళవారం తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంటకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకున్న ఆయన బాబుపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పేదల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే.. చంద్రబాబు దాన్ని పెత్తందార్ల వశం చేశారన్న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని వారిని మంత్రులుగా చోటు కల్పించటం దారుణమన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న తనను బాబు మానసికంగా చాలా వేధించారని వాపోయారు.