Begin typing your search above and press return to search.
రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్..మోత్కుపల్లి నిప్పులు
By: Tupaki Desk | 20 Oct 2017 10:53 AM GMTతెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సాగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. పార్టీ సమావేశంలో - విలేకరుల సమావేశంలో ఆయన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఏకంగా బ్లాక్‌మెయిలర్ అని అభివర్ణించారు. రేవంత్ రెడ్డి పార్టీ మార్పు నేపథ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతల సమావేశానికి హాజరైన అనూహ్యరీతిలో హాజరైన రేవంత్ రెడ్డిని మోత్కుపల్లి - ఉమామాధవరెడ్డిలు నిలదీశారు. ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కలిస్తే తప్పేమిటని మీడియా ఛాట్ లో రేవంత్ రెడ్డి అనడాన్నివారు ప్రశ్నించారు. ఎవరి అనుమతితో మాట్లాడుతున్నారంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఈ రోజు జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశం అనంతరం మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని అభివర్ణించారు. పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ వైపు రేవంత్ మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో బాధ్యుడు ‘ఎవరో’ కాదని, రేవంత్ రెడ్డేనని మోత్కుపల్లి చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి కావాలనేది ఆయన ఆలోచన రేవంత్ అడుగుపెట్టిన నాటి నుంచి టీడీపీ బలహీన పడిందని ఆరోపించారు. ఆయన దూకుడు భరించలేకే ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోయారు విమర్శించారు. తాజాగా రేవంత్ రెడ్డి వైఖరి నచ్చకే తాము సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశామని చెప్పారు. రేవంత్ రెడ్డి వల్లనే పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ సైతం రేవంత్ తీరును తప్పుపట్టారు. పార్టీ నియమనిబంధనలను రేవంత్ తుంగలో తొక్కారని ఆరోపించారు. తాము అడిగిన వాటికి కూడా రేవంత్ స్పందించలేదని ఆక్షేపించారు. అందుకే తాము వాకౌట్ చేశామని వెల్లడించారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల సమావేశం మొత్తం హాట్ హాట్ గా జరిగింది. ఓ సందర్భంలో రేవంత్- మోత్కుపల్లిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్టీ జాతీయ అథ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలియకుండా రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అధికారం మీకెక్కడిదని నిలదీశారు. పైగా పార్టీ మారుతున్నారని తమ పేరును ఎలా ప్రస్తావిస్తారని మోత్కుపల్లి నర్సింహులు - ఉమా మాధవరెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నైన తనను ప్రశ్నించే హక్కు మీకెక్కడిదని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్ వారికి అన్ని విషయాలూ చంద్రబాబు వద్దే మాట్లాడతాను అని బదులిచ్చినట్లు తెలిసింది. దీంతో రేవంత్ వైఖరికి నిరసనగా మోత్కు పల్లి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. అనంతరం విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిపడ్డారు.