Begin typing your search above and press return to search.
బాబు ఓడాడని శ్రీవారికి మొక్కు.. సంచలనం
By: Tupaki Desk | 6 Jun 2019 5:26 AM GMTఒకరి ఓటమిని మరొకరు పండుగ చేసుకోవడం చూశాం..కానీ ఓటమికి మొక్కు లు మొక్కి మరీ వాటిని చెల్లించుకోవడం ఇప్పుడే చూస్తున్నాం.. తెలుగు రాజకీయాల్లోనే ఈ సంచలనానికి వేదికగా మార్చారు టీడీపీ మాజీ నేత, సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నర్సింహులు.. తాజాగా చంద్రబాబు ఓటమికి ఆయన ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు.. పార్టీ చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబుపై పీకల్లోతు కోపంతో ఉన్న మోత్కుపల్లి కూడా బాబు ఓటమితో దేవుడికి మొక్కు చెల్లించుకున్నారు. ఇప్పుడీ చర్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది..
చంద్రబాబు తనను రాజకీయంగా వాడుకొని మోసం చేశాడని మోత్కుపల్లి కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. గవర్నర్ పదవి ఇస్తానని.. రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని ఆరోపించి టీడీపీ నుంచి బహిష్కరింపబడ్డారు మోత్కుపల్లి నర్సింహులు..
అయితే తాజా ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని అంతకుముందే శ్రీవారిని దర్శించుకొని మోత్కుపల్లి నర్సింహులు మొక్కు మొక్కుకున్నారట.. కోరుకున్నట్టే బాబు ఓడిపోవడంతో ఆయన తన మొక్కు చెల్లించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించిన అనంతరం మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. టీడీపీ ఓటమితో తాను ఎంతో ఎంజాయ్ చేశానని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. అభిమానులు, కార్యకర్తలకు స్వీట్లు పంచానన్నారు.
ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా చంద్రబాబు వెంటనే ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని మోత్కుపల్ి డిమాండ్ చేశారు. నాడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు తీయడమే కాదు.. ఆయన బ్యాంక్ అకౌంట్స్ కూడా చంద్రబాబు లాక్కున్నాడని చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన ఆరోపణలు చేశాడు.