Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ మోత్కుపల్లి పరిస్థితి విషమం..

By:  Tupaki Desk   |   7 Dec 2018 4:35 AM GMT
ఎన్నికల వేళ మోత్కుపల్లి పరిస్థితి విషమం..
X
టీడీపీ సీనియర్ నేతగా వెలుగు వెలిగి.. అనంతరం బాబు చేసిన మోసంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు ప్రస్తుతం నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన చివరి వరకు టీఆర్ ఎస్ - కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం స్వతంత్రుడిగా పోటీ చేద్దామని భావించినా సాధ్యపడలేదు. బీఎల్ఎఫ్ టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు.

తాజాగా పోలింగ్ కు ముందు గురువారం అర్థరాత్రి ఆయన తీవ్ర మనోవేధనకు గురై చాతినొప్పితో బాధపడ్డారు. గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం..

తెలంగాణ ఎన్నికల వేళ ఒంటరిగా బరిలోకి దిగిన మోత్కుపల్లి ఈ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు పెంచుకున్నారు. తనను రాజకీయంగా వాడుకొని వదిలేశారని.. ఎన్నికల్లో గెలుస్తానో లేదోనని రాత్రంతా మదనపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ కోవలోనే చాతినొప్పి వచ్చి ఆస్పత్రి పాలయ్యారు. మోత్కుపల్లి లాంటి సీనియర్ నేతను వాడుకొని వదిలేసిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై మోత్కుపల్లి కార్యకర్తలు మండిపడుతున్నారు.