Begin typing your search above and press return to search.
బాబుకు ఝలక్ ఇచ్చిన మోత్కుపల్లి
By: Tupaki Desk | 1 March 2016 7:31 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇబ్బందుల్లో పడేశారు. పార్టీ అత్యున్నత వేదిక అయిన పొలిట్ బ్యూరోలోనే అధినేత వైఖరిని తప్పుపట్టడమే కాకుండా పార్టీని టార్గెట్ చేసిన కేసీఆర్ తో పోలిక పెట్టారు.
ఇంతకీ విషయమేమిటంటే..విజయవాడలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరైన మోత్కుపల్లి ఈ సందర్భంగా జంప్ జిలానీలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తెలుగుదేశం పార్టీలో ఇటీవల పలువురు నేతలు చేరటాన్ని ప్రస్తావిస్తూ...పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ది , మీది ఒకే విధానమని తేల్చేశారు. మోత్కుపల్లి కామెంట్ తో ఒకింత ఇబ్బందిపడ్డ బాబు సున్నిత ముగింపు పలికే ప్రయత్నం చేశారు. నాయకులు పార్టీ మారడం అనేది ఇప్పుడే ప్రారంభం కాలేదని...ఎప్పట్నుంచో కొనసాగుతోందని వివరించారు.
ఇదిలాఉండగా మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తపరచడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఆయన తనను కలిసిన పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... పార్టీ అధినేత తన సేవలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. గ్రేటర్ ప్రచారంలో నేను మీకు కనిపించానా అంటూ ప్రవ్నించారు. మోత్కుపల్లికి రాజ్యసభ సీటు ఇస్తారని, ఈశాన్య రాష్ట్రాలకు గవర్నర్ గా పంపిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది వాస్తవరూపం దాల్చని నేపథ్యంలో తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో మోత్కుపల్లి ఉన్నట్లు భావిస్తున్నారు.