Begin typing your search above and press return to search.
ఇంకో ఎత్తు వేసిన మోత్కుపల్లి
By: Tupaki Desk | 17 Nov 2016 7:30 PM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత - టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు రాజకీయాల్లో క్రియాశీలం అయ్యేందుకు మరోమారు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వ మిత్రపక్షం కాబట్టి గవర్నర్ పదవి దక్కుతుందనే గంపెడాశతో ఉన్న మోత్కుపల్లి అది వర్కవుట్ కాకపోవడంతో రాజకీయ అంశాలపై దృష్టిసారించారు. ఈ క్రమంలో టీడీపీలో తన సమ ఉజ్జీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై పరోక్ష యుద్ధానికి సిద్ధమయ్యారు. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ లో రగులుతున్న మాదిగల వర్గీకరణ అంశం ఆధారంగా కడియంను మోత్కుపల్లి టార్గెట్ చేశారు. ఏకంగా బహిరంగ సభతో ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల టీఆర్ ఎస్ అనుకూల వర్గాలతో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తూ కడియం శ్రీహరి హైదరాబాద్ లో మాదిగల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ వేదికగా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విభజన పూర్తిచేయాలని అల్టిమేటం జారీచేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పలు తటస్థ మాదిగ సంఘాలు సైతం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బృందానికి మద్దతిచ్చాయి. దీంతో రాజకీయంగా తాను చురుకుగా నిలిచేందుకు మోత్కుపల్లి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈనెల 27న సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో మాదిగల ధర్మయుద్ధ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ సమావేశానికి హాజరై దళిత శక్తిని చాటాలని మోత్కుపల్లి కోరారు. ఈ పరిణామం చూస్తుంటే గతంలో కడియం శ్రీహరి కులం ఆధారంగా ఆయన్ను ఇరుకున పెట్టిన మోత్కుపల్లి ఇపుడు అదే కులం ఆధారంగా కడియంపై పైచేయి సాధించుకోవాలని చూస్తున్నట్లుందని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/