Begin typing your search above and press return to search.
కేసీఆర్‌ను పొగిడిన మోత్కుపల్లి
By: Tupaki Desk | 26 Oct 2015 5:03 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఇంతెత్తున ఎగిరిపడే తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తాజాగా తన సహజశైలికి భిన్నంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన నాయకుడైన మోత్కుపల్లి భువనగిరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును పొగిడేశారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో లక్ష్మీనరసింహ స్వామికి వైభవం దక్కుతుందని చెప్పారు. అయితే కేవలం ఈ ఒక్కమాటే చెప్పి ఊరుకోకుండా ఒకట్రెండు చిన్నచిన్న విమర్శలు కూడా చేశారు. యాదగిరిగుట్టను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. యాదగిరిగుట్టను జిల్లా చేయకుండా సిద్దిపేట జిల్లాలో కలిపితే సహించబోమని చెప్పారు.
తెలంగాణ సర్కార్ పాలనా వైఫల్యాలపై తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడుతున్న సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేసీఆర్ విమర్శకుల్లో మొదటి వరుసలో ఉండే మోత్కుపల్లి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.