Begin typing your search above and press return to search.
మోత్కుపల్లి కల్లబొల్లి
By: Tupaki Desk | 15 Nov 2015 9:21 AM GMTతెలంగాణ తెలుగుదేశం నేతలు తమ పార్టీ అదినేత - ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విడిచి ఉండలేకపోతున్నారట. అంతేకాదు... సొంతంగా ఎదగండయ్యా బాబూ! నా వైపు చూడొద్దు. మీరే నాయకులైపోండి అని చంద్రబాబు డైరెక్టుగా చెబుతున్నా కూడా వారు మాత్రం 'మేం మీ వేలు పట్టుకునే ఉంటాం.. మీ చిటికెన వేలు విడిచి ఉండలేం" అంటూ బొమ్మరిల్లు సిద్ధార్థల్లా ఉంటామంటున్నారు.
మాట్టాడుతున్నారు. ఇటీవల చంద్రబాబుతో సమావేశమైన టీటీడీపీ నేతలు తమ అధినేతతో ఇదే విషయం చెప్పారట. మిమ్మల్ని విడిచి ఉండలేం సార్ అంటూ కొందరు నేతలు ఏకంగా ఏడ్చినంత పనిచేశారట.
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు టిటిడిపి నేతలతో సమావేశమైనప్పుడు సొంతంగా ఎదగాలని సూచించారు. ఆ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ వారానికి రెండు రోజులైనా తెలంగాణకు రావాలని,మీ వేలు విడిచి ఉండలేమని అన్నారట. అంతేకాదు... అలా కుదరకపోతే తనకు కూడా అమరావతిలో ఒక ప్లాట్ ఇవ్వాలని చమత్కరించారట. దాంతో సభికులంతా గొల్లుమని నవ్వారట. మరి ఒకప్పుడు గులాబీ రంగుపై మోజు పడిన మోత్కుపల్లి చంద్రబాబు వేలు విడవలేనంతగా ఇప్పుడు మారిపోవడం వెనుక కారణమేంటో అని టీటీడీపీ నేతల్లో కొందరు అంటున్నారు. మోత్కుపల్లివి కల్లబొల్లి మాటలని విమర్శిస్తున్నారు. అంతేకాదు.. మీకోసం విజయవాడ రాలేకపోతున్నాం... ఇక్కడ ఉండకపోతే ఎలా అన్న ఉద్దేశంతోనే ఆయన ఆ మాటలన్నారని చెబుతున్నారు.